హైదరాబాద్ నడి బొడ్డున బీజేపీకి భారీ షాక్..!!
హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి మీర్జా రియాజ్ ఉల్ హాసన్ 63 ఓట్లతో విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి గౌతమ్‌రావుకు 25 ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికలో ఎంఐఎం, బీజేపీ మాత్రమే పోటీలో నిలిచాయి. ఈ స్థానానికి 22 సంవత్సరాల విరామం తర్వాత ఎన్నిక జరగింది. ఈ ఎన్నికకు కాంగ్రెస్, బీఆర్ఎస్ దూరంగా ఉండగా.. బీజేపీ ఊహించని రీతిలో అభ్యర్థిని రంగంలోకి దింపడం ద్వారా ఈ ఎన్నిక ఆసక్తి కరంగా మారింది.
హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో ఎంఐఎం విజయం సాధించారు. ఎంఐఎం అభ్యర్థి మీర్జా రియాజ్ ఉల్ హాసన్ విజయం సాధించారు. ఎంఐఎం అభ్యర్థి మీర్జా రియాజ్ ఉల్ హాసన్‌కు 63 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి గౌతమ్‌రావుకు 25 ఓట్లు దక్కించుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కౌటింగ్ ఈ రోజు జరిగింది.ఈ నెల 23న జరిగిన ఎన్నికల్లో 78.57 శాతం పోలింగ్ నమోదు అయింది. మొత్తం 112 ఓట్లకు గాను 88 ఓట్లు పోలయ్యాయి. 66 మంది కార్పొరేటర్లు, 22 మంది ఎక్స్ అఫిషియో సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించు కున్నారు. పోలింగ్‌లో బీజేపీ , కాంగ్రెస్, ఎంఐఎం కార్పొరేటర్లు, ఎక్స్ ఆఫీషియె సభ్యులు పాల్గొన్నారు. ఓటింగ్‌కు బీఆర్ఎస్ కార్పొరేటర్లు దూరంగా ఉన్నారు. తొలి నుంచి గెలుపుపై ఎంఐఎం ధీమాగా ఉంది. మరోవైపు క్రాస్ ఓటింగ్‌పై బీజేపీ ఆశలు పెట్టుకుంది.

తొలి నుంచి ఈ ఎన్నిక పైన మూడు పార్టీల మధ్య రాజకీయంగా చర్చ జరిగింది. ఈ నియోజకవర్గం లో ఎంఐఎం కు అత్యధిక ఓట్లు ఉన్నాయి. దీంతో.. ఎంఐఎం గెలుపు ఖాయమని అందరూ భావిం చారు. బీజేపీ అనూహ్యంగా బరిలోకి దిగింది. రెండు పార్టీలు తమ ఓటర్లతో చివరి వరకు భేటీలు నిర్వహించారు. ఫలితం ఎలా ఉన్నా... కాంగ్రెస్, బీఆర్ఎస్ తరహాలో తాము పోటీకి దూరంగా ఉండమని బీజేపీ నేతలు తేల్చి చెప్పారు. తమ ఓట్లతో పాటుగా క్రాస్ ఓటింగ్ జరుగుతుందని బీజేపీ భావించింది. అయితే, అనూహ్యంగా బీజేపీ అంచనాలు తప్పాయి. ఊహించిన విధంగానే ఎంఐఎం అభ్యర్ధి విజయం సాధించారు.












Click it and Unblock the Notifications