ఆగస్టు 30న ఎయిర్‌టెల్ మారథాన్: పూర్తి వివరాలు(ఫోటోలు)

హైదరాబాద్: హైదరాబాద్ రన్నర్స్ అసోసియేషన్, ఎయిర్ టెల్ కంపెనీ సంయుక్తంగా ఆగస్టు 30వ తేదీన నగరంలో మారథాన్ రన్‌ను నిర్వహించనున్నట్టు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, ఎయిర్ టెల్ సీఈఓ వెంకటేష్ విజయ రాఘవన్, డైరెక్టర్ నన్నపనేని మురళీ తెలిపారు.

గురువారం ఓ ప్రైవేట్ హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ ఎయిర్‌టెల్ నిర్వహించే మారథాన్‌కు అన్ని విధాలా సహకరిస్తామని అన్నారు. అలాగే ఎయిర్ టెల్ సీఈఓ వెంకటేష్ విజయ రాఘవన్ మా, డైరెక్టర్ నన్నపనేని మురళీ మట్లాడుతూ ఆగస్టు 29వ తేదీన 5కే, 10కే, 3కే, హాఫ్ మారథాన్, 30వ తేదీన మారథాన్ రన్‌లను నిర్వహిస్తామని అన్నారు.

 ఆగస్టు 30న ఎయిర్‌టెల్ మారథాన్

ఆగస్టు 30న ఎయిర్‌టెల్ మారథాన్


ఇందులోని విజేతకు 7 లక్షల 50వేల రూపాయల బహుమతితో పాటు పతకాన్ని అందజేస్తామని చెప్పారు.

ఆగస్టు 30న ఎయిర్‌టెల్ మారథాన్

ఆగస్టు 30న ఎయిర్‌టెల్ మారథాన్


3కే, 5కే రన్‌లకు రూ. 500, 10కే రన్‌కు రూ. 800, హాఫ్ మారథాన్‌కు రూ. 1200 రిజిస్ట్రేషన్ ఫీజుగా నిర్ణయించామన్నారు.

 ఆగస్టు 30న ఎయిర్‌టెల్ మారథాన్

ఆగస్టు 30న ఎయిర్‌టెల్ మారథాన్


అనంతరం మారథాన్‌కు సంబంధించిన టీ షర్ట్, పతకాన్ని మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు.

 ఆగస్టు 30న ఎయిర్‌టెల్ మారథాన్

ఆగస్టు 30న ఎయిర్‌టెల్ మారథాన్

హుస్సేన్ సాగర్ నుంచి ప్రారంభమయ్యే మారథాన్ రన్ పంజాగుట్ట, సోమాజిగూడ, కేబీఆర్ పార్కు, జూబ్లిహిల్స్, ఐటీ హబ్ గుండా జీఎంసీ బాలయోగి స్టేడియంలోకి ప్రవేశించనుంది. మారథాన్ దృష్ట్యా 42.195 కిలోమీటర్ల మేర రహదారులను ఆరోజు మూసివేస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+