శ్రీమంతుల బాటలో: జుకల్ గ్రామస్తులతో ఏసిబి డీజీ ఏకె ఖాన్ భేటీ
హైదరాబాద్: తెలంగాణ ఏసీబీ డీజీ ఏకే ఖాన్ రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని జుకల్ గ్రామాన్ని గురువారం దత్తత తీసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామంలో పర్యటించిన ఏకే ఖాన్ అక్కడి పరిస్థితులను పరిశీలించారు.
గ్రామాభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై గ్రామస్థులతో మాట్లాడి తెలుసుకున్నారు. భేటీ సందర్భంగా గ్రామాభివృద్ధికి చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఆయన గ్రామస్తులతో చర్చలు జరిపారు.

ఇటీవలే ఏకె ఖాన్.. పంచాయతీరాజ్ శాఖ మంత్రి కెటి రామారావును కలిసి జుకల్ గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఆయన దత్తత తీసుకున్న గ్రామంలో గురువారం పర్యటించారు.
ఇప్పటికే పలువురు ప్రముఖులు వెనుకబడిన గ్రామాలను దత్తత తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఏసీబీ డీజీ జూకల్ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. ఇటీవలే ప్రముఖ సినీనటులు మహేష్ బాబు, ప్రకాష్ రాజ్ మహబూబ్నగర్ జిల్లాలోని రెండు వెనకబడిన గ్రామాలను దత్తత తీసుకున్నారు.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications