హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బ్రెయిన్ డెడ్: అవయవదానం, ఐదుగురికి పునర్జన్మ

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఏపీలో మణికంఠ, తెలంగాణలో మధు అఖిల్. చెరో ఐదుగురికి పునర్జన్మను ప్రసాదించారు. అఖిల్ మరణవార్త వినగానే తొలుత తల్లడిల్లిపోయిన కుటుంబ సభ్యులు, అతన్ని తిరిగి బతికించుకోనేదారి గురించి ఆలోచించారు. ఈ క్రమంలో అవయవదానానికి ముందుకొచ్చారు.

Akhil who gives life for people by organ donation

విజయవాడకు చెందిన మణికంఠ కుటుంబం చొరవతో ఐదుగురికి మరుజన్మ లభించిన ఉందతం బుధవారం హైదరాబాద్‌లో పువరావృతం అయింది. హైదరాబాద్ వనస్ధలీపురానికి చెందిన మధు అఖిల్ బీటెక్ చదువుతున్నాడు.

ఇంటికి బైకుపై వస్తూ సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. తీవ్ర గాయాలతో ఆసుపత్రికి తరలించిన అఖిల్‌ను పరీక్షించిన వైద్యులు బ్రెయిన్ డెడ్‌గా ప్రకటించారు. చిన్న కుమారుడు దూరమయ్యాడన్న వార్త విని తల్లిదండ్రులు మధు శ్రీనివాసరావు, సుమతి కౌసల్యలను కుదిపి వేసింది.

Akhil who gives life for people by organ donation

ఈ సమయంలో వారిని జీవన్‌ధార ప్రతినిధులు కలిసి అవయవదానానికి ఒప్పించారు. వెంటనే రంగంలోకి దిగిన ప్రత్యేక వైద్యుల బృందం అఖిల్ శరీరం నుంచి కిడ్నీలు, కాలేయం, కళ్లు సేకరించారు. అనంతరం అఖిల్ మృతదేహాన్ని వనస్దలిపురంలోని సాహెబ్ నగర్ శ్మశాన వాటికలో అంత్రక్రియలు నిర్వహించారు.

English summary
Akhil who gives life for people by organ donation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X