వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీజేపి ఛీఫ్ కు ప్రమాద ఘంటికలు.!అధిష్టానం టచ్ లో ఆ ఉద్యమ నేత.!"సన్ స్ట్రోక్" ప్రభావమేనా.?

"రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు. చివరి నిమిషం వరకూ పార్టీకోసం సర్వం ధారపోసినా అంతిమ ఫలితం మాత్రం అధిష్టానం నుండి ప్రతికూలాంగా రావచ్చు. ప్రస్తుతం తెలంగాణ బీజేపి లో నెలకొన్న పరిస్థితి ఇదే.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : రాజకీయాల్లో ఏదీ శాశ్వతం కాదనే నానుడి ఇప్పుడు తెలంగాణ బీజేపి పార్టీకి అతికినట్టు సరిపోతుంది. ఎన్నో సమస్యలను అదిగమించి, మరెన్నో కష్టాలను భరించి పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో శక్తి వంచన లేకుండా శ్రమించిన ప్రస్తుత బీజేపీ తెలంగాణ అద్యక్షుడు బండి సంజయ్ కుమార్ పరిస్దితి అగమ్యగోచరంగా మారనుందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. అందుకు తగ్గట్టే బండి సంజయ్ కుమార్ తన దూకుడు కూడా బాగా తగ్గించారనే చర్చ జరుగుతోంది. ఇటీవల ఆయన కుమారుడు యుమకుల మీద చేసిన బౌతిక దాడుల వీడియోలు కూడా బండి సంజయ్ కి శరాఘాతంగా మారినట్టు తెలుస్తోంది.

బండి సంజయ్ వినూత్న సాహసం

బండి సంజయ్ వినూత్న సాహసం

పాదయాత్రతో పార్టీకి మంచి ప్రజాధరణ..
పాదయాత్రతో పార్టీకి మంచి ప్రజాధరణ తీసుకొచ్చిన బండి సంజయ్ రాజకీయ ప్రస్ధానంపై నీలి నీడలు కమ్ముకున్నాయనే సంకేతాలు వస్తున్నాయి. పాద యాత్రల పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నప్పటికీ బీజేపి పట్ల ప్రజల్లో అనుకున్నంత చర్చ జరగడంలేదని, ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో పార్టీని ఎంతవరకు ఆధరిస్తరనే ప్రశ్న అధిష్టానాన్ని తొలచివేస్తున్నట్టు తెలుస్తోంది. బండి సంజయ్ ప్రభావం ఎన్నికల వరకూ కొనసాగి అది ఓట్ల రూపంలో ప్రజలకు ప్రేరణ కలిగిస్తుందా లేదా అనే సమాలోచనలో బీజేపి అదిష్టానం ఉన్నట్టు తెలుస్తోంది.

గ్రామస్దాయిలో పార్టీ ఎక్కడ.?

గ్రామస్దాయిలో పార్టీ ఎక్కడ.?

తెలంగాణలో గ్రామీణ వాతావరణంలో పార్టీ బలోపేతం కానంత వరకూ అధికారంలోకి రావడం కల అనే ధోరణిలో బీజేపి అదిష్టానం ఉన్నట్టు సమాచారం. గ్రామీణ ప్రజానికాన్ని, యువతను, మహిళలను ఆకర్శించాలని, పార్టీని ఆ వర్గాలకు చేరువ చేయాలన్నదే బీజేపి ఢిల్లీ పెద్దల వ్యూహంగా తెలుస్తోంది. పట్టణాలు, నగరాల్లో పార్టీకి వస్తున్న ఆధరణను చూసి సంతృప్తి పడితే బంగపాటు తప్పదని, క్షేత్రస్దాయిలో ప్రభావం చూపిస్తేనే ఆశించిన లక్ష్యాన్ని చేరుకుంటామనే అంశాన్ని అదిష్టానం పార్టీ ముఖ్యనేతలకు సూచిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకోసం క్షేత్రస్ధాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలనే సంకేతాలనిస్తున్నట్టు సమాచారం.

తెలంగాణపై జాతీయ బీజేపి ప్రత్యేక దృష్టి..

తెలంగాణపై జాతీయ బీజేపి ప్రత్యేక దృష్టి..

ఇక గ్రామ స్ధాయిలో పార్టీని బలోపేతం చేసే సత్తా బండి సంజయ్ కుమార్ కు ఉందా అనే సందేహాలనే అధిష్టానం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. మహాసంగ్రామ పాద యాత్ర తర్వాత పార్టీని అంతగా ప్రజల్లోకి తీసుకెళ్లిన దాఖలాలు బండి సంజయ్ కి లేవని, మునుగోడు ఉప పోరులో ఫలితం ఎందుకు ప్రతికూలంగా వచ్చిందనే అంశాలపై అధిష్టానం పూర్తి స్దాయిలో అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. బీజేపి పార్టీ జాతీయ అద్యక్షుడు జేపీ నడ్డా, హోం మంత్రి అమీత్ షా, తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్, ప్రకాష్ జవదేకర్ తెలంగాణలో జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నట్టు తెలుస్తోంది.

బండి స్థానంలో ఈటల..

బండి స్థానంలో ఈటల..

ఇటీవల కాలంలో బండి సంజయ్ కుమార్ కు పార్టీలో కొంత అసంతృప్తి సెగలు రేగినట్టు తెలుస్తోంది. అంతే కాకుండా ఆయన కుమారుడి బౌతిక దాడులు, బూతు పురాణం పై కూడా అదిష్టానం దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారం పార్టీకి ఎంతవరకు నష్టం చేకూర్చిందనే అంశంపై ఆరా తీస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఇలాంటి తరుణంలో తెలంగాణ పార్టీ వ్యవహారాల బాద్యతలను ఓ మాస్ నాయకుడికి అప్పగిస్తే వచ్చే ఎన్నికల్లో సానుకూల ఫలితాలు రావచ్చనే సమాలోచనలు చేస్తోంది ఢిల్లీ అదిష్టానం. అందులో భాగంగా తెలంగాణ ఉద్యమ నేత ఈటల రాజేందర్ కు పార్టీ పగ్గాలు అప్పగించి, గ్రామీణ ప్రజానికాన్ని ఆకర్శించేందుకు ప్రణాళిక రచిస్తోంది బీజేపి అధిష్టానం.

English summary
The current BJP Telangana president Bandi Sanjay Kumar Parisditi, who has worked tirelessly to take the party to the masses, will become invisible, the answers are yes. It is being discussed that Bandi Sanjay Kumar has also reduced his aggression.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X