Alert : తెలంగాణలో ఐదురోజుల పాటు పెరగనున్న ఎండలు..
తెలంగాణలో ఐదురోజుల పాటు ఎండలు వీపరీతంగా పెరగనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మొన్నటివరకు అకాల వర్షాలు కురవగా, వారం రోజులు పాటు ఎండల ఊసే లేదు. ఇప్పడు మళ్లీ ఎండల తీవ్రత కొనసాగుతాయని వాతావరణ శాఖ అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు. నేటి నుంచి తెలంగాణ రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరగనున్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వివరించారు.
వచ్చే ఐదు రోజుల్లో తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరగనునున్నాయని, దక్షిణ దిశ నుంచి రాష్ట్రంలోకి కిందిస్థాయి గాలుల ప్రభావంతో రెండు డిగ్రీల సెల్సియస్ నుంచి మూడు డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు పెరిగే సూచనలున్నట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలోని ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎండల తీవ్రత మరింత ఎక్కువవుతుందని, ఈ జిల్లాతో పాటు సిద్ధిపేట, సంగారెడ్డి, మెదక్ వంటి మరికొన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పెరిగే సూచనలున్నాయని అధికారులు తెలిపారు.

ఈ ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరువలో ఉన్నాయని వివరించారు. ఇక, సిద్ధిపేట జిల్లాలో శనివారం నాడు అయితే, 39.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యాయని ఐఎండీ తెలిపింది. సంగారెడ్డి జిల్లా కల్హేరిలో ఉష్ణోగ్రతలు 38.7 డిగ్రీలు నమోదు కాగా, మెదక్ జిల్లా శివ్వంపేటలో 37.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
అవసరం ఉంటే తప్పా బయటికి రావొద్దు...
ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని, మధ్యాహ్నా వేళ్లలో అవసరం ఉంటే తప్పా బయటకు రావొద్దని అధికారులు అంటున్నారు. ఈ సమయంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. తప్పనిసరి పరిస్థితిలో బయటికి వెళ్లినవారు నిమ్మరసం, మజ్జిగ, కొబ్బరి నీళ్లు వంటివాటిని అధికంగా తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. ఇక, రాత్రిపూట సాధారణ ఉష్ణోగ్రతల నమోదు అవుతున్నాయని ఐఎండీ అధికారులు వెల్లడించారు.












Click it and Unblock the Notifications