ఆస్తమా పేషెంట్లకు అలర్ట్.. చేప ప్రసాదం పంపిణీకి డేట్ ఫిక్స్ !
తెలంగాణలో మృగశిర కార్తె సందర్భంగా ఆస్తమా, ఇతర శ్వాసకోశ సమస్యలతో బాధ పడే వారి కోసం చేప మందు కార్యక్రమం ఏటా నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ఈ పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తారు. బత్తిని కుటుంబ సభ్యులు గత 178 సంవత్సరాలుగా చేప ప్రసాదాన్ని ఉచితంగా అందిస్తున్నారు. ఆస్తమా, సహా ఇతర శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుందని ప్రజలు నమ్ముతారు. అందుకే ఈ చేప ప్రసాదం కోసం కేవలం తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పలు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున తరలివస్తుంటారు.
ఇక ఈ ఏడాది కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు 2025లో చేప ప్రసాదం పంపిణీ జూన్ 8, 9 తేదీలలో జరపాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని విభాగాల్లో సహకరించనుంది. అందులో నీటి సరఫరా, రవాణా, విద్యుత్, పోలీసు భద్రత, మత్స్య శాఖ సహకారం వంటి అంశాలు ఉన్నాయి. కాగా ఈ సంవత్సరం 5 నుంచి 6 లక్షల మంది ఈ చేప ప్రసాదం కోసం వస్తారని అంచనా వేస్తున్నారు.

మరోవైపు ఈ చేప ప్రసాదం తీసుకునే వారు బత్తిని కుటుంబం సూచించిన ఆహార నియమాలను పాటించాల్సి ఉంటుంది. నాలుగు సంవత్సరాల పాటు వరుసగా ఈ ప్రసాదం తీసుకోవాలి. శాఖాహారుల కోసం, చేపలకు బదులుగా బెల్లం తో తయారు చేసిన ప్రత్యేక ప్రసాదం అందుబాటులో ఉంటుంది.












Click it and Unblock the Notifications