భ‌క్తుల‌కు అల‌ర్ట్‌.. నేటి నుంచే యాదాద్రిలో వార్షిక ప‌విత్రోత్స‌వాలు..

తెలంగాణలో ప్ర‌సిద్ధిచెందిన పుణ్య‌క్షేత్రాల‌లో యాద‌గిరి గుట్ట ఒక‌టి. ఈ ఆల‌యానికి నిత్యం భ‌క్తులు తండోప‌తండాలుగా త‌ర‌లివస్తుంటారు. యాదాద్రి న‌ర‌సింహాస్వామి ద‌ర్శ‌నానికి వెళ్లే భ‌క్తుల‌కు ముఖ్య‌మైన గ‌మ‌నిక‌. యాదాద్రి కొండ‌పై నేటి నుంచి వార్షిక ప‌విత్రోత్స‌వాలను నిర్వ‌హించ‌న‌నున్నారు. వీటితోపాటు ఈ ఆల‌యంలో ఉత్స‌వాల‌ను కూడా జ‌ర‌ప‌నున్న‌ట్లు ఆల‌య అధికారులు తెలిపారు.

ఉత్స‌వాలు ఆగ‌స్టు 16వ తేది నుంచి మూడు రోజులపాటు జరగనున్నాయి. స్వామివారి ఆల‌యంలో ఏటా ఉత్స‌వాలు నిర్వ‌హిస్తారు. ఈ ఉత్స‌వాలను ఏడాది కాలం నుంచి ఆస్థాన పరంగా, భక్తుల మొక్కు పూజల నిర్వహణలో జ‌రిగిన పొర‌పాట్ల కార‌ణంగా ఈ పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆన‌వాయితీ.

Alert to devotees Annual Purification Festival in Yadadri from today

ఈ ఉత్స‌వాల్లో భాగంగా ప్ర‌తిసారి నిర్వ‌హించిన విధంగానే ఈ సారి కూడా చేయ‌నున్నారు. ఈ మేర‌కు శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆల‌య‌ ఆధ్వర్యంలో అన్నీ ఏర్పాట్లు పూర్తి చేశామని ఆలయ ఈవో భాస్కరరావు తెలిపారు. ప‌విత్రోత్స‌వాల్లో భాగంగా నేటి సాయంత్రం శ్రీ‌ల‌క్ష్మి న‌ర‌సింహ‌స్వామి ఆల‌యంలో విష్వక్సేన పూజ, స్వస్తి వాచకం, రక్షా బంధనం, మంత్ర పుష్ప నీరాజనంతోపాటు మూర్తి మంత్ర హోమం కూడా జ‌ర‌ప‌నున్న‌ట్లు ఆల‌య అధికారులు, అర్చకులు వివ‌రించారు.

ప్ర‌ధాన ఆల‌యంతోపాటు యాద‌గిరి గుట్ట‌కు అనుబంధంగా కొనసాగుతున్న పాతగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలోనూ వార్షిక పవిత్రోత్సవాలు జరపనున్నట్లు అధికారులు ప్ర‌క‌టించారు. ఈ ఉత్స‌వాల సంద‌ర్భంగా ఆల‌యంలో నిత్యం జ‌రిగే ప‌లు కార్య‌క్ర‌మాల‌ను నిలిపివేస్తున్న‌ట్లు అధికారులు తెలిపారు. గురు, శుక్రవారాల్లో భక్తుల ఆర్జిత నిత్య సుదర్శన హోమం, శ్రీ లక్ష్మీనరసింహస్వామి కల్యాణం పర్వాలను ర‌ద్దు చేస్తున్న‌ట్లు ఆల‌య అధికారులు వెల్ల‌డించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+