Hyderabad: వాహనదారులకు అలర్ట్, ట్రాఫిక్స్ రూల్స్ ఉల్లంఘిస్తే జేబుకు చిల్లే!

హైదరాబాద్: నగరంలో ట్రాఫిక్ నిబంధనలు మరింత కఠినంగా అమలు చేయనున్నారు పోలీసులు. ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే వాహనదారుల జేబులకు ఛిల్లు తప్పేలా లేదు. భారీ మొత్తంలో చాలన్ల నుంచి తప్పించుకోవాలంటే.. వాహనదారులంతా ఖచ్చితంగా ట్రాఫిక్ రూల్స్ పాటించాల్సిందే.

రహదారుల భద్రత, వాహనదారుల ప్రాణరక్షణపై పోలీసులు దృష్టి సారించారు. రోడ్డు ప్రమాదాల్లో అధిక శాతం ద్విచక్ర వాహనదారులే ఉండటంతో వారిపైనే ప్రత్యేక దృష్టిసారిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాంగ్ సైడ్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్ నివారణకు స్పెషల్ డ్రైవ్ చేపట్టనున్నట్లు హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు.

Alert to two wheelers: Huge fines for traffic rules violation in Hyderabad city from NOv 28th

నవంబర్ 21 నుంచి ఈ ఉల్లంఘనలపై ద్విచక్ర వాహనదారులకు అవగాహన కల్పించి, నవంబర్ 28 నుంచి కేసులు నమోదు చేయనున్నారు ట్రాఫిక్ పోలీసులు. ఇప్పటి వరకు సర్కిల్స్ వద్ద స్టాప్‌ లైన్ దాటితే 100 రూపాయలు, ఫ్రీ లెప్ట్‌కు బ్లాక్ చేస్తే 1000 రూపాయలు, పాదాచారులకు అడ్డు కలిగించేలా వాహనాలు నిలిపితే రూ. 600, ఫుట్‌పాత్‌లను ఆక్రమిస్తే భారీ ఫైన్స్ వేస్తూ వాహనదారులను నిబంధనలు పాటించేలా చేస్తున్నారు.

ఇక, తాజాగా ఈ రూల్స్ మరింత కఠినతరమయ్యాయి. రాంగ్ రూట్‌లో డ్రైవింగ్ చేస్తే రూ.1700, ట్రిపుల్ రైడింగ్ చేస్తే రూ.1200 ఫైన్ వేయనున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఇందుకోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నారు. నవంబర్ 28 నుంచి అమల్లోకి రానున్నాయి. రూల్స్ పాటించని వాహనాదారులు నిఘా కెమెరాలకు చిక్కినా భారీ ఫైన్స్ తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ట్రాఫిక్‌ రద్దీని కంట్రోల్ చేసేందుకు ప్రతి ఒక్కరు రూల్స్ పాటించాలని కోరుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+