ఇంటి వద్దకే ఆధార్ సేవలు - అర్హులు వీరే, ఇలా దరఖాస్తు చేయండి..!!
ఆధార్. ఇప్పుడు బ్యాంకు ఖాతాల నుంచి ప్రభుత్వ పథకాల వరకు ప్రతీ సందర్భంలోనూ తప్పని సరిగా మారింది. రిజర్వేషన్లు మొదలు విద్యా సంస్థల్లో చేరికల వరకు ఆధార్ వినియోగిస్తున్నారు. ఇప్పటికే ఆధార్ సేవల్లో కీలక మార్పులు తెచ్చారు. ఆన్ లైన్ లో అప్డేట్.. మార్పులు, చేర్పులకు అవకాశం కల్పించారు. కాగా.. తాజాగా ఇంటి వద్దకే ఆధార్ సేవలను తీసుకొస్తూ తాజాగా నిర్ణయం తీసుకున్నారు. ఈ సేవలు వినియోగించుకోవటానికి అర్హులు.. దరఖాస్తు విధానం పైన అధికారులు స్పష్టత ఇచ్చారు.
ఆధార్ సేవలను సులభతరం చేసారు. ఇప్పటికే అప్డేట్ తో పాటుగా మార్పులకు అవకాశం కల్పిస్తూ ఆన్ లైన్ విధానం తీసుకొచ్చారు. కాగా, ఇక నుంచి వృద్ధులు, దివ్యాంగులు, అనారోగ్ యంతో ఇబ్బందులు పడేవారు.. ఇంటి నుంచి బయటకు వచ్చే పరిస్థితిలేని వారు ఆధార్ కార్డు కోసం, అప్‌డేట్ కోసం కార్యాలయాలకు వెళ్లాల్సిన పనిలేదు. వారికోసం సిబ్బంది ఇంటి వద్దకే వచ్చి ఆధార్ కార్డుకు సంబంధించిన వివరాలు నమోదు చేసుకుంటారు. అయితే, ఇందుకోసం ముందుగా వ్యక్తి కుటుంబీకులు ఎవరైనా ఉడాయ్ ప్రాంతీయ కార్యాలయంలో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఇంటి వద్దనే ఆధార్ సేవలు పొందేందుకు వృద్ధులు, మంచం పట్టినవారు, బలహీనులు, దివ్యాంగులు అర్హులు గా నిర్ణయించారు.

ఇక.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్ అమీర్‌పేటలోని మైత్రీవనంలో ఉడాయ్ ప్రాంతీయ కార్యాలయం ఉంది. ఇంటి వద్ద ఆధార్ సేవల కోసం దరఖాస్తు విధానం పైనా అధికారులు స్పష్టత ఇచ్చారు. ఆధార్ కావాల్సిన వ్యక్తి పరిస్థితి, అప్‌డేట్ చేసుకోవాల్సిన అవ సరం, వయసు వంటి పూర్తి వివరాలు తెలిసేలా సమాచారం ఇవ్వాలి. సంబంధిత వ్యక్తి ఏ పరిస్థి తిలో ఉన్నారు.. ఎందుకు కార్యాలయానికి రాలేకపోతున్నారు.. అనే వివరాలతో అర్థమయ్యేలా తీసిన ఫొటోను తీసి దరఖాస్తుకు జతచేయాలి. వైద్యులు ఇచ్చిన మెడికల్ సర్టిఫికెట్ కూడా పొందుపరచాలి.
ఒక ఫొటో, మరో గుర్తింపు కార్డు పత్రాలు వాటితో పాటు ఇవ్వాలి.ఆధార్ లోని తప్పులు, ఇబ్బందుల పూర్తి వివరాలు కనుక్కోవడానికి ఉడాయ్ సిబ్బంది సుమారు ఏడు రోజుల సమయం తీసుకుంటారు. ఆ తరువాత ఇంటి వద్దకే వచ్చి సమస్యను పరిష్కరిస్తారు. దీనికోసం దూరంతో నిమిత్తం లేకుండా రూ.700 ఛార్జ్ చేస్తారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications