ఇలా ఉంటే ఎలా? ఇక నైనా మారండి!
ప్రతిపక్షాలకు విమర్శలకు తగిన విధంగా స్పందించడం లేదంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. అసెంబ్లీ సమావేశాలకు అందరు ఎమ్మెల్యేలు తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించారు. ప్రతిపక్షాలు గందరగోళం చేసే ప్రయత్నం చేస్తాయని, సంయమనంతో వ్యవహరించాలని సూచించారు.
అసెంబ్లీ ప్రాంగణంలో జరిగిన సీఎల్పీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని పలు సూచనలు చేశారు. సభలో వ్యవహరించాల్సిన విధానంపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశాదిర్దేశం చేశారు. ప్రజా ప్రభుత్వంలో ఇవి రెండో పూర్తిస్థాయి బడ్జెట్ సమావేశాలని, అత్యంత కీలకమైనవని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. ఈ 15 నెలల్లో ప్రజా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై చర్చించుకునేందుకు ఈ సమావేశాల్లో అవకాశం ఉందని తెలిపారు.

అయితే, కొందరు అసెంబ్లీని నిర్లక్ష్యం చేస్తున్నారని సీఎం రేవంత్ అసహనం వ్యక్తం చేశారు. హాజరైతేనే సభలో ఏం జరుగుతుందో తెలుస్తుందన్నారు. సీఎల్పీ భేటీలో మాట్లాడుతుండగా బయటకు వెళ్లిన నాగార్జున సాగర్ ఎమ్మెల్యే జైవీర్‌పై సీఎం రేవంత్ అసహనం వ్యక్తం చేశారు. ఓ వైపు నేను ఇంత సీరియస్‌గా మాట్లాడుతుంటే ఇతనేంటి అలా వెళ్తున్నారు. ఇంత నాన్ సీరియస్‌గా ఉంటే ఎలా? అని ప్రశ్నించారు.
మనం మరోసారి గెలవాలంటే సీరియస్‌గా పనిచేయాల్సిందేనని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. రాజకీయాలు అంటే పిల్లల ఆటలు కాదన్నారు. అందరం కలిసి పనిచేస్తేనే మరోసారి మన ప్రభుత్వం వస్తుందని స్పష్టం చేశారు. కొందరి వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు రావొద్దన్నారు. ఇక నుంచీ అందరూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండాలన్నారు. ఏప్రిల్ 6వ తేదీ నుంచి అన్ని జిల్లాల ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి లంచ్ మీటింగ్ పెట్టుకుందామని, అందరి పనితీరుపై చర్చిద్దామని సీఎం రేవంత్ తెలిపారు.
చాలా మంది ప్రజాప్రతినిధులు సీరియస్‌గా పనిచేయట్లేదన్నారు సీఎం రేవంత్. ఒకసారి గెలవడం గొప్ప కాదని.. మరోసారి అసెంబ్లీకి రావడమే గొప్ప అని అన్నారు. చాలా మంది బీఆర్ఎస్ పట్ల సైలెంట్‌గా ఉంటున్నారు. అలా చేస్తే మీ మీద అభ్యర్థిని పెట్టరు అనుకుంటున్నారా? అలా అస్సలు ఊహించుకోకండి. వాళ్ల గురించి తనకు బాగా తెలుసని సీఎం రేవంత్ తెలిపారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అన్నింటికీ ధైర్యంగా ముందుకెళ్లాలన్నారు.
-
హైదరాబాద్ మెట్రో విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన! -
ఆసుపత్రిలో సోనియా గాంధీ అడ్మిట్: హుటాహుటిన రాహుల్, ప్రియాంక: అబ్జర్వేషన్ లో -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
దానం నాగేందర్‌కు బిగ్ షాక్.. అనర్హత వేటుపై అనూహ్య ట్విస్ట్..!! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్"











Click it and Unblock the Notifications