Tg Sarpanch Elections : సర్వం సిద్ధం.. నేడే తొలి దశ పంచాయతీ ఎన్నికలు !
తెలంగాణలో తొలి దశ గ్రామ పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్దమైంది. మొదటి విడతలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 189 మండలాల్లో 4,236 సర్పంచ్, 37,440 వార్డులకు సంబంధించి ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం 37,562 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. కాగా పోలింగ్ ముగిసిన అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించి ఫలితాలను ప్రకటిస్తారు. అనంతరం వార్డు సభ్యులతో సమావేశాలు భేటీ అయ్యి ఉపసర్పంచ్‌ని ఎన్నుకుంటారు.
అలానే ఈ ఎన్నికల్లో తొలి విడతలో 56,19,430 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో 27,41,070 మంది పురుషులు, 28,78,159 మంది మహిళలు, 201 మంది ఇతరులు ఉన్నారు. ఇవి రాజకీయ పార్టీ రహిత ఎన్నికలు అయినప్పటికీ పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని... తమ మద్దతుదారులను అభ్యర్థులుగా బరిలోకి దించాయి. ఆయా ప్రాంతాల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు సైతం ప్రచారంలో పాల్గొన్నారు.

ఇక మొత్తంగా పరిశీలిస్తే ఐదు సర్పంచి పదవులకు, 169 వార్డు పదవులకు నామినేషన్లు దాఖలు కాలేదని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని స్పష్టం చేశారు. అలానే 396 సర్పంచ్, 9,633 వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవమయ్యాయని ప్రకటించారు. ఒక సర్పంచ్, 10 వార్డు స్థానాల ఎన్నికలపై న్యాయస్థానం స్టే విధించినట్టు తెలిపారు. ఇవి మినహాయించి మిగతా స్థానాలకు ఈరోజు ( డిసెంబర్ 11, 2025 ) ఎన్నికలు జరగనున్నాయి.
అంతే కాకుండా ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వివరించారు. ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. సమస్యాత్మకంగా గుర్తించిన 3,461 పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ కెమెరాలు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. 50 వేల మంది సివిల్ పోలీసులు, 60 ప్రత్యేక పోలీసు ప్లటూన్‌లు, రెండు వేల మంది అగ్నిమాపక, అటవీ సిబ్బంది బందోబస్తు విధులు నిర్వహిస్తారన్నారు. ఇప్పటికే ఎన్నికల ప్రవర్తనా నియమావళి (కోడ్) ఉల్లంఘనపై 3,214 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు అయ్యాయని.. పలు సెక్షన్ల కింద 31,428 మందిని బైండోవర్ చేసినట్టు తెలిపారు.
మరోవైపు ఇప్పటి వరకు రూ.1,70,58,340 నగదుతో పాటు రూ.2,84,97,631 విలువైన మద్యం.. రూ.2,22,91,714 విలువైన మత్తుపదార్థాలు, రూ.12,15,500 విలువైన ఆభరణాలు, మరో రూ.64,15,350 విలువైన సామగ్రి కలిపి మొత్తం రూ.7,54,78,535 సీజ్ చేసినట్టు వెల్లడించారు. ఎన్నికల కమిషన్ 9240021456 టోల్‌ఫ్రీ నంబర్‌తో కాల్ సెంటర్ ఏర్పాటు చేశామని.. ఓటర్లు నిర్భయంగా, స్వేచ్ఛగా ఓటుహక్కు వినియోగించుకోవాలని కోరారు.
-
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది












Click it and Unblock the Notifications