రేవంత్ సమర్ధతకు పరీక్ష - కీలక మలుపు..!!
తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు హోరా హోరీగా మారుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ ఎంపీ సీట్ల పైన ఫోకస్ చేసింది. అసెంబ్లీ తరహాలోనే మెజార్టీ సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. బీఆర్ఎస్ తిరిగి పూర్వ వైభవం కోసం ప్రయత్నిస్తోంది. బీజేపీ ఈ సారి తమ సత్తా చాటుతామని చెబుతోంది. ఇటు పోలింగ్ కోసం ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. మూడు పార్టీలకు ఈ ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా మారుతున్నాయి.
సర్వం సిద్దం
మరి కొద్ది గంటల్లో తెలంగాణలో ఎంపీ స్థానాలకు పోలింగ్ ప్రారంభం కానుంది. ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లుపూర్తి చేసింది. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా 400 కోట్లకు పైగా విలువగల డబ్బు, మద్యం, వస్తువులను సీజ్ చేసింది. ఎన్నికల నిఘా, భద్రత కోసం రాష్ట్ర పోలీసులతో పాటు, 175 కంపెనీల కేంద్ర భద్రతా బలగాలతో నిఘా పెట్టింది.ఎన్నికల విధుల్లో 2.80 లక్షల మంది ఉద్యోగులు పాల్గొననున్నారు.

ఈనెల 13న తెలంగాణలో జరిగే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలో మొత్తం 3.32 కోట్ల మంది ఓటర్లు ఉండగా. ఇందులో సగానికి పైగా మహిళా ఓటర్లే ఉన్నారు. 17 పార్లమెంట్ నియోజకవర్గాలకుగాను 13 నియోజక వర్గాల్లో మహిళ ఓటర్లే ఎక్కువగా ఉన్నారు.
ప్రత్యేక ఏర్పాట్లు
రాష్ట్ర వ్యాప్తంగా 35 వేల 809 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రతి పోలింగ్ స్టేషన్లలో ఎండలను దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లు చేయాలని సూచించింది ఎన్నికల సంఘం. 9,900 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించిన ఎన్నికల సంఘం, అలాంటి ఏరియాల్లో ప్రత్యేక బలగాలతో నిఘా పెట్టేలా ప్లాన్ చేసింది. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 వరకు పోలింగ్ జరుగనుంది.
రాష్ట్రంలో 13 అసెంబ్లీ నియోజకవర్గాలను నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించిన ఎన్నికల సంఘం.. అలాంటి ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ జరగాలని నిర్ణయించింది. రాష్ట్ర పోలీసులతో పాటు ఎన్నికల విధుల్లో భాగంగా కేంద్రం నుండి 175 కంపెనీలు విధుల్లో ఉండనున్నాయి.
రాజకీయ ఉత్కంఠ
ఎన్నికల విధుల్లో 2.80 లక్షల మంది ఉద్యోగులు విధులు నిర్వర్తించనున్నారు. ఎన్నికల్లో వ్యయ పరిశీలకులుగా 14 మందిని నియమించారు. జనరల్ పరిశీలకులుగా 17 మందిని నియమించారు. ఇక హోమ్ ఓటింగ్ కోసం 23,247 మంది ఓటర్లు దరఖాస్తు చేసుకోగా. ఇందులో 21,651 మంది ఓటు వేశారు. ఇక పోస్టల్ బ్యాలెట్ ద్వారా లక్ష 80 వేలకు పైగా ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఈ ఎన్నికలు మూడు పార్టీల కు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. మెజార్టీ సీట్లు సాధించి రేవంత్ తన సమర్ధత నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. బీజేపీ సైతం ఇక్కడే గురి పెట్టింది. కేసీఆర్ అంచనాలు ఏ మేర నిజం అవుతాయనేది కీలకంగా మారుతోంది. మారుతున్న లెక్కలతో ఎన్నికలు రాజకీయంగా ఉత్కంఠ పెంచుతున్నాయి.
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications