కేసీఆర్ మార్క్ ఎంపిక, వారికి లేనట్లే - జాబితాలో ఉన్నదెవరు..!!

ముఖ్యమంత్రి కేసీఆర్ హ్యాట్రిక్ పై గురి పెట్టారు. ప్రతిపక్షాల కంటే ముందుగానే అభ్యర్ధులను ప్రకటించేందుకు సిద్దమయ్యారు. బీఆర్ఎస్ తొలి జాబితా విడుదలకు రంగం సిద్దమైంది. నియోజకవర్గాల్లో అసంతృప్తిని మూటగట్టుకున్నవారితోపాటు ప్రజల్లో పట్టు సాధించని వారిని పక్కనపెడుతున్నారు. సమర్థులకే టికెట్‌ ఖరారు చేస్తున్నారు. పబ్లిక్ పల్స్ కు అనుగుణంగా అభ్యర్దులను ఖరారు చేస్తున్నారు. తుది జాబితా ఫైనల్ దాదాపు ఫైనల్ అయింది.

వీరికి సీట్లు లేనట్లేనా: ముఖ్యమంత్రి కేసీఆర్ అభ్యర్దుల ఎంపిక లో తన మార్క్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. దాదాపు 20 నుంచి 25 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను పక్కన బెడుతున్నారు. వారికి ఇప్పటికే పరోక్షంగా సంకేతాలు ఇచ్చింది. పార్టీకి విధేయులుగా ఉంటూ, క్షేత్ర స్థాయిలో బలం తగ్గిన వారికి సీటు ఇవ్వకపోయినా ప్రత్యామ్నాయం కల్పిస్తామని హామీ ఇస్తోంది. గెలుపే ప్రామాణికంగా అభ్యర్దుల ఎంపిక జరుగుతోంది..అధికారం లక్ష్యంగా నిర్ణయాలు తీసుకుంటున్నామని స్పష్టం చేస్తోంది.

All set for release BRS first list of candidates for the upcoming Assembly polls, see details

ఈ క్రమంలో స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే రాజయ్య, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిను తప్పించి.. కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్‌రెడ్డిలకు టికెట్‌ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. ఉప్పల్‌ అభ్యర్థిగా లక్ష్మారెడ్డికి టికెట్‌ ఇస్తామని స్వయంగా కే సీఆర్‌ ఫోన్‌ చేశారు. చివరి నిమిషంలో బొంతు రామ్మెహన్ పేరు తెర పైకి వచ్చింది.

సిట్టింగ్ లు మార్పు దిశగా: ఈసారి సిటింగ్‌ల మార్పు ఖాయమనే నియోజకవర్గాల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. పూర్వ వరంగల్‌ జిల్లాలోని స్టేషన్‌ ఘన్‌పూర్‌, జనగామ, వరంగల్‌(తూర్పు)తో పాటు పూర్వ మహబూబ్‌నగర్‌ జిల్లాలోని కల్వకుర్తి, నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్‌, కోదాడ, మునుగోడు, కరీంనగర్‌ జిల్లాలోని వేములవాడ, రామగుండం, జగిత్యాల, కోరుట్ల, ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఆసిఫాబాద్‌, బెల్లంపల్లి, ఖానాపూర్‌, ఖమ్మం జిల్లాలో వైరా, కొత్తగూడెం, ఇల్లెందు ఉన్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని నర్సాపూర్‌, జహీరాబాద్‌ నియోజకవలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

గ్రేటర్‌ హైదరాబాద్‌లోని ఉప్పల్‌, ముషీరాబాద్‌, అంబర్‌పేటలోనూ కొత్త ముఖాలే రానున్నాయి. మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు, ఎమ్మెల్సీ కవిత ఎవరికి వారు తమవారికి టికెట్లు ఇవ్వాలని కోరుతుండటంతో.. వారు ప్రతిపాదించిన అభ్యర్థుల బలాబలాలపై కూడా అధినేత సర్వేలు చేయిస్తున్నారు.

All set for release BRS first list of candidates for the upcoming Assembly polls, see details

గెలుపే ప్రామాణికంగా: మెదక్‌లోని నర్సాపూర్‌ ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి స్థానంలో మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి, ఆదిలాబాద్‌ జిల్లాలోని ఆసిఫాబాద్‌లో కోవా లక్ష్మి, ఖానాపూర్‌లో కేటీఆర్‌ బాల్యమిత్రుడు భూక్యా జాన్సన్‌ నాయక్‌కు, వేములవాడలో చెన్నమనేని రమేశ్‌ స్థానంలో చల్మెడ లక్ష్మీనర్సింహారావుకు, వరంగల్‌ తూర్పు బరిలో నన్నపనేని నరేందర్‌ స్థానంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్రకు, రామగుండంలో కోరుకంటి రవిచందర్‌కు బదులుగా సింగరేణి కార్మిక నేత లేదా మరో మహిళా నేత పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం.

పట్నం మహేందర్‌రెడ్డి తాండూరుటికెట్‌ కోసం గట్టిగా పట్టుబడుతుండడంతో.. వచ్చే టర్మ్‌లో మంత్రి పదవి ఇస్తానని ఆయనకు సీఎం హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. చెన్నమనేని రమేశ్‌కు కూడా ఎమ్మెల్సీగా చాన్స్‌ ఇవ్వనున్నారు. వారుసులకు సీట్ల విషయంలో కేసీఆర్ తిరస్కరించినట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+