తెచ్చిన అప్పులన్నీ కమీషన్ల రూపంలో కేసీఆర్ ఇంట్లోకి వెళ్లాయి.!కాళేశ్వరం టూరిజం కోసమేనన్న షర్మిళ.!
మధిర/హైదరాబాద్ : ప్రజాసంకల్ప యాత్రలో మరో సారి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు తెలంగాణ వైఎస్సార్ టీపి అద్యక్షురాలు వైయస్ షర్మిళ. ప్రజలకు అనేక సమస్యలున్న అంశాన్ని ఎత్తి చూపేందుకే ప్రజాక్షేత్రంలో తిరుగుతున్నట్టు షర్మిళ స్పష్టం చేసారు. ప్రజల ప్రక్షాన పోరాడేందుకే పాదయాత్ర చేస్తున్నానని, దమ్ముంటే తనతో ఒక్క రోజు పాదయాత్ర చేయాలని, ప్రజా సమస్యలు లేవని నిర్దారణ జరిగితే ముక్కు నేలకు రాసి ఇంటికి వెళ్లి పోతానని ప్రభుత్వానికి షర్మిళ సవాల్ విసిరారు. సమస్యలు ఉంటే రాజీనామా చేసి దళితుడిని ముఖ్యమంత్రిని చాయాలని తెలంగాణ ప్రభుత్వానికి షర్మిల హితవు పలికారు. పాదయాత్రలో భాగంగా 12వందల కిలోమీటర్ల వైలురాయిని చేరుకున్నారు షర్మిళ.

ప్రజల అభిమానమే నడిపించింది..12వందల కిలోమీటర్ల మైలు రాయిని చేరుకున్న షర్మిళ
ప్రజల అభిమానమే 12 వందల కిలోమీటర్లు నడిపించిందన్నరు షర్మిళ. నడిచింది తానే అయినా, నడిపించింది మాత్రం ప్రజల అభిమానమేనన్నారు. దివంగత వైఎస్సార్ ఏ పథకమైనా ప్రజలకోసమే రూపొందించారని, మధిర నియోజక వర్గం దళిత నియోజక వర్గం అని ఎక్కువ శ్రద్ధ పెట్టారని షర్మిల గుర్తు చేసారు. రెండు వేల కోట్ల రూపాయలు ఈ నియోజక వర్గంకు ఖర్చు పెట్టారని, ఈ నియోజక వర్గంలో ఎన్నో గ్రామాలకు రోడ్ కనెక్టివిటీ కల్పించారని, బిటి రోడ్లు వేయించారని, అండర్ బ్రిడ్జీలు కట్టించారని, వైఎస్సార్ బ్రతికి ఉంటే జాలముడి ప్రాజెక్ట్ పూర్తయ్యేదన్నారు షర్మిళ. వేల ఎకరాలకు సాగు నీరు, వందల గ్రామాలకు తాగునీరు అందేదన్నారు.

ప్రజలను పచ్చి మోసం చేసిన కేసీఆర్.. దళితుడిని ఎందుకు సీఎం చేయలేదన్న షర్మిల
ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుకు దళితుల మీద ప్రేమ లేనే లేదని, దళిత ముఖ్యమంత్రి దగ్గర నుంచి దళిత బందు వరకు అన్ని మోసాలేనన్నారు. చంద్రశేఖర్ రావు దళిత నాయకులను కనీసం పక్కన కూడా పెట్టుకోడని ఎద్దేవా చేసారు. దళితుల మీద దాడులు 800 శాతం పెరిగాయని, నేరెళ్ళ ఘటనలో దళితులపై దాడి చేయించి జైల్లో పెట్టించారని ఆవేదన వ్యక్తం చేసారు. మరియమ్మ అనే దళిత మహిళలను జైల్లో చంపేశారని, దళితున్ని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి, చేయకపోతే తల నరుక్కుంటా..కానీ మాట తప్పను అని ఎన్నో సార్లు చెప్పి చివరికి మాట తప్పి ప్రజలను పచ్చిమోసం చేసారని షర్మిళ గుర్తు చేసారు.

బీజేపీ కూడా తెలంగాణ రాష్ట్రాన్ని మోసం చేసింది.. దేశంలో ఎన్ని ఉద్యోగాలిచ్చారో బీజేపి చెప్పాలన్న షర్మిళ
బీజేపీ కూడా తెలంగాణ రాష్ట్రాన్ని మోసం చేసిందన్నారు వైయస్ షర్మిళ. దేశంలో ఎన్ని లక్షల ఉద్యోగాలు బీజేపీ ఇచ్చిందో చెప్పాలని నిలదీసారు. విభజన హామీలు కూడా నెరవేర్చలేదని, బీజేపీకి మత పిచ్చి పట్టినట్లు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని మండి పడ్డారు షర్మిళ. చంద్రశేఖర్ రావు అవినీతిపై ఆధారాలు ఉన్నాయని చెప్తున్న బీజేపి నాయకులు, కేంద్ర మంత్రులు ఎందుకు బయట పెట్టడం లేదని, సీబీఐ దర్యాప్తుకు ఎందుకు ఆదేశాలు ఇవ్వడం లేదని షర్మిళ నిలదీసారు. బీజేపి టీఆర్ఎస్ పార్టీలు కలిసే డ్రామాలాడుతున్నాయన్నారు షర్మిళ.

టూరిజం కోసమే కాళేశ్వరం.. రైతులకు ఏమాత్రం ఉపయోగపడని ప్రాజెక్టు అన్న షర్మిళ
చంద్రశేఖర్ రావుకు పరిపాలన చేతకాదని, ముష్టి ఐదు వేలు రైతు బందు ఇస్తే రైతులు కోటీశ్వరులు అవుతారా అని ప్రశ్నించారు. డెబ్బై వేల కోట్లు కాళేశ్వరం ప్రాజెక్ట్ లో కమీషన్ల రూపంలో దండుకున్నారని, ఇంత ఖర్చు పెట్టినా ఆ ప్రాజెక్ట్ నిరుపయోగంగా మారిందన్నారు షర్మిళ. కాళేశ్వరం ప్రాజెక్ట్ టూరిజం కోసం కట్టినట్లు ఉంది తప్ప సాగునీటికోసం కాదన్నారు. సముద్రపు నీళ్ళు సముద్రం లోనే పోసినట్లు ఉందని, కరెంట్ బిల్లులు కోట్లలో కట్టిస్తుంది తప్ప రైతులకు మాత్రం ఎందుకు ఉపయోగం లేదని మండిపడ్డారు. 16 వేల కోట్ల మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని 4 లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టి వేసిన ఘనత చంద్రశేఖర్ రావుకే దక్కుతుందన్నారు వైయస్ షర్మిళ.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !!












Click it and Unblock the Notifications