ఎస్సై నిర్వాకం: మహిళలను ట్రాప్ చేస్తాడు, రెండో పెళ్లి చేసుకున్నాడు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలో ఓ ఏస్సైపై తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. మహిళలను ట్రాప్ చేయడమే పనిగా పెట్టుకున్న రఫీక్ ఖాన్ అనే ఎస్సై మొదటి భార్యను వేధిస్తూ రహస్యంగా రెండో పెళ్లి చేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. మొదటి భార్య తల్లిదండ్రులతో పాటు రెండో భార్యగా భావిస్తున్న యువతి తల్లిదండ్రులు కూడా అతనిపై ఆరోపణలు చేశారు.
రఫీక్ ఖాన్‌కు మొదటి భార్యతో ఇద్దరు పిల్లలున్నారు. అతను వాణిలత అనే అమ్మాయిని బెదిరించి పెళ్లి చేసుకున్నట్లు ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. రఫీక్ ఖాన్ నుంచి తమకు ప్రాణ భయం ఉందంటూ వారు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తమ అమ్మాయిని కిడ్నాప్ చేసి, ఆమె నుంచి సర్టిఫికెట్లు లాక్కున్నాడని వారు చెబుతున్నారు.

ఇదిలావుంటే, విడాకులు ఇవ్వాలంటూ తమ కూతురిని బెదిరిస్తున్నాడంటూ రఫీక్ ఖాన్ మొదటి భార్య తల్లిదండ్రులు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వారు ఓ ప్రముఖ టీవీ చానెల్ ప్రతినిధితో మాట్లాడుతూ పలు ఆరోపణలు చేశారు.
మరో అమ్మాయి గురించి ప్రశ్నించినప్పుడు విడాకులు ఇవ్వాలని తనను బెదిరించాడని మొదటి భార్య ఫిర్యాదు చేసింది. తెల్ల కాగితంపై సంతకం పెట్టాలని కూడా బెదిరించాడని ఆరోపించింది. ఆ తర్వాత ఇంట్లోంచి వెళ్లిపోయాడని చెప్పింది. ఈ ఫిర్యాదుల నేపథ్యంలో ఎస్సై రఫీక్ ఖాన్ అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం.
-
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి.. -
అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !!












Click it and Unblock the Notifications