Pushpa2: రేవతి కుటుంబానికి అండగా అల్లు అర్జున్, కీలక ప్రకటన

హైదరాబాద్ నగరంలోని ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్య థియేటర్ వద్ద పుష్ప-2 (Pushpa-2) ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన విషాద ఘటనపై టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్ స్పందించారు. మృతురాలు రేవతి కుటుంబానికి అండగా ఉంటామని అన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా అల్లు అర్జున్ శుక్రవారం ఓ వీడియో విడుదల చేశారు.

'మేం పుష్ప-2 ప్రీమియర్ షోకి ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌కు వెళ్లాం. తొక్కిసలాటలో కొందరికి దెబ్బలు తగిలాయని తర్వాత తెలిసింది. ఇద్దరు పిల్లల తల్లి రేవతి చనిపోయారని తెలియగానే చిత్ర బృందమంతా షాక్‌కు గురయ్యాం. థియేటర్‌కు వెళ్లి అభిమానులతో కలిసి సినిమా చూడటమనేది గత 20 ఏళ్లుగా నాకు ఆనవాయితీగా వస్తోంది' అని అల్లు అర్జున్ తెలిపారు.

Allu Arjun supports Revathi s family Key statement

అయితే, ఇన్నేళ్లలో ఎప్పుడూ ఏం జరగలేదు. ఊహించని ఈ ఘటన మిమ్మల్ని ఎంతగానో కలిచివేసింది. చిత్ర విజయోత్సవాలు కూడా నిర్వహించలేదు. ప్రేక్షకులు థియేటర్‌కు వచ్చి ఎంజాయ్ చేయడానికే మేం సినిమాలు చేస్తుంటాం అని అర్జున్ తెలిపారు. అలాంటి థియేటర్ వద్ద విషాద ఘటన జరగడం బాధగా ఉందన్నారు.

రేవతి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. మేం ఏం చేసినా.. ఎంత మాట్లాడినా ఆమె లేని లోటును తీర్చలేనిది. వారి కుటుంబానికి నేను అండగా ఉంటా. నా తరపున రూ. 25 లక్షలు సాయం ఇవ్వాలని నిర్ణయించుకున్నా. చికిత్స ఖర్చులు కూడా భరిస్తాం. ఇలాంటి ఊహించని ఘటనలు జరిగినప్పుడు మాకూ ఉత్సాహం ఉండదు. మీకు వినోదాన్ని పంచాలన్నదే మా ప్రయత్నం. సినిమాలు చూసేందుకు వెళ్లినప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. క్షేమంగా ఇంటికి తిరిగి వెళ్లండి అని అల్లు అర్జున్ ఆ వీడియోలో పేర్కొన్నారు.

కాగా, బుధవారం రాత్రి పుష్ప-2 ప్రీమియర్ షోను అభిమానులతో కలిసి చూసేందుకు సంధ్య థియేటర్‌కు అల్లు అర్జున్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఈ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఆమె కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మరోవైపు, ఈ ఘటన నేపథ్యంలో అల్లు అర్జున్, ఆయన సిబ్బంది, సంధ్య థియేటర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+