ప్రభాస్‌ను వెనక్కి నెట్టిన అల్లు అర్జున్..ఇండియాలో టాప్ హీరోగా రికార్డ్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భారతీయ సినీ పరిశ్రమలో సంచలనం సృష్టించారు. తన నటన, స్టైల్, పాన్-ఇండియా క్రేజ్‌తో ఇప్పటికే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బన్నీ, ఇప్పుడు రెమ్యూనరేషన్ విషయంలో సరికొత్త రికార్డును నెలకొల్పారు. ఇండియన్ సినీ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోగా అల్లు అర్జున్ అగ్రస్థానంలో నిలిచారు.
తాజా సినీ వర్గాల సమాచారం ప్రకారం, త్వరలో అట్లాగే దర్శకత్వంలో తెరకెక్కనున్న AA22 చిత్రం కోసం అల్లు అర్జున్ ఏకంగా రూ. 175 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇది భారతీయ సినిమాలో ఇప్పటివరకు ఏ హీరో అందుకోనంత భారీ మొత్తం.

పాత రికార్డును బద్దలు: అంతకుముందు పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ కొన్ని సినిమాలకు రూ. 150 కోట్లు తీసుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆ రికార్డును సైతం బన్నీ బద్దలు కొట్టడం గమనార్హం.
'పుష్ప: ది రైజ్' సినిమా సాధించిన అద్భుత విజయం, ముఖ్యంగా హిందీ మార్కెట్‌లో బన్నీకి తెచ్చిపెట్టిన అపరిమితమైన క్రేజ్ ఈ భారీ పారితోషికానికి ప్రధాన కారణం. దేశవ్యాప్తంగా అల్లు అర్జున్‌కు ఉన్న డిమాండ్ దృష్ట్యా, నిర్మాతలు ఈ మొత్తాన్ని చెల్లించడానికి సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది.
ఈ రెమ్యూనరేషన్ లెక్కలు చూసి అల్లు అర్జున్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మా ఐకాన్ స్టార్ హాలీవుడ్ రేంజ్‌కు వెళ్లారంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. తన ప్రతి సినిమాతో సరికొత్త బెంచ్‌మార్క్ సెట్ చేస్తున్న అల్లు అర్జున్, రాబోయే సినిమాలతో ఇండియన్ సినిమాకు గ్లోబల్ స్థాయిలో గుర్తింపు తేవడం ఖాయమని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
త్వరలోనే 'పుష్ప 2: ది రూల్'తో ప్రేక్షకుల ముందుకు రానున్న బన్నీ.. ఆ తర్వాత AA22తో మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications