Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మోడీ ఖర్చులతో పాటు..ఆర్టీఐ ద్వారా కేంద్రానికి చుక్కలు చూపిస్తాం: బీజేపీపై టీఆర్ఎస్ ఎటాక్

తెలంగాణ రాష్ట్రంలో బిజెపి మరియు టీఆర్ఎస్ పార్టీల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతున్న వేళ బీజేపీపై టీఆర్ఎస్ ఎదురుదాడికి దిగింది. తాజాగా పియుసి చైర్మన్ జీవన్ రెడ్డి తెలంగాణ బీజేపీ నాయకుల పై, ప్రధాని నరేంద్ర మోడీ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తాజాగా ఆర్టీఐ ద్వారా వివిధ శాఖలకు సమాచారం కావాలని అప్లికేషన్లు బీజేపీ పెట్టిన నేపధ్యంలో మీకే కాదు మాకు తెలివి ఉందని అంటున్నారు జీవన్ రెడ్డి .

అబద్దాల యూనివర్సిటీకి మోడీ వీసీ

అబద్దాల యూనివర్సిటీకి మోడీ వీసీ

తాము కేంద్ర శాఖలకు సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తులు చేస్తామని చెప్తున్నారు. అబద్ధాల యూనివర్సిటీకి ప్రధాని మోడీ వైస్ ఛాన్సలర్ గా వ్యవహరిస్తున్నారని జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు. తమ 100 ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేసిన జీవన్ రెడ్డి, ఒకవేళ సమాధానం చెప్పు లేకపోతే తెలంగాణ ప్రజలు బిజెపి ని బొంద పెట్టడం ఖాయమంటూ హెచ్చరించారు. ఇక బండి సంజయ్ తొండి సంజయ్ గా మారారని విమర్శలు గుప్పించారు.

డి గ్యాంగ్ గా ప్రధాని మోడీ, బండి సంజయ్, కిషన్ రెడ్డి, అరవింద్ లు

డి గ్యాంగ్ గా ప్రధాని మోడీ, బండి సంజయ్, కిషన్ రెడ్డి, అరవింద్ లు

ప్రధాని మోడీ తో పాటు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అరవింద్ డి గ్యాంగ్ గా మారారని జీవన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వారిని దోపిడీ దొంగలుగా, డెకాయిట్ లుగా, డ్రగ్స్ గ్యాంగ్ గా జీవన్ రెడ్డి అభివర్ణించారు. బండి సంజయ్ రాష్ట్రంలోని వివిధ శాఖల నుండి సమాచార హక్కు చట్టం కింద సమాచారం కావాలని దరఖాస్తు చేశారని, తాము కూడా కేంద్ర ప్రభుత్వ శాఖల నుంచి సమాధానం కోరుతూ సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేస్తున్నానని వెల్లడించారు. ఇప్పటివరకు బీజేపీ తాము ఇచ్చిన హామీలను అమలు చేయలేదని మండిపడ్డారు.

మోడీ బట్టల ఖర్చు, ప్రయాణాల ఖర్చు లెక్కలు చెప్పాలన్న జీవన్ రెడ్డి

మోడీ బట్టల ఖర్చు, ప్రయాణాల ఖర్చు లెక్కలు చెప్పాలన్న జీవన్ రెడ్డి


ప్రధాని మోడీ ధరించే బట్టల ఖర్చెంత? ఆయన విదేశీ ప్రయాణాల వ్యయం ఎంత? సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన మోడీ ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? మొత్తం ఎనిమిది సంవత్సరాలలో 16 కోట్ల ఉద్యోగాలు ఏవి? బిజెపికి మహిళలపై ప్రేమ ఉంటే మహిళా రిజర్వేషన్ బిల్లును ఎందుకు తీసుకు రాలేదు? ప్రతి ఒక్కరి ఖాతాలో 15 లక్షల చొప్పున జమ చేస్తామని చెప్పిన బిజెపి ఎందుకు జమ చేయలేదు? ఇప్పటివరకు రైతులకు చేసిన మేలు ఏంటి? చెప్పాలని ప్రశ్నించారు.

కేంద్ర ప్రభుత్వ శాఖలకు సంబంధించి సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తులు చేస్తాం

కేంద్ర ప్రభుత్వ శాఖలకు సంబంధించి సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తులు చేస్తాం

కాళేశ్వరం ప్రాజెక్టు ఒకటైన కట్టారా? ఏ రాష్ట్రంలో నైనా మిషన్ భగీరథ తరహాలో నల్లాల ద్వారా మంచినీటిని ఇచ్చారా? బీజేపీ పాలనలో ఏ రాష్ట్రంలో నైనా కళ్యాణ లక్ష్మి పథకం అమలు అవుతుందా? వంటి అనేక ప్రశ్నలు సంధించి, అన్ని కేంద్ర ప్రభుత్వ శాఖలకు సంబంధించి సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేస్తామంటూ వెల్లడించారు. ఉక్రెయిన్ రష్యా మధ్య జరిగిన యుద్ధాన్ని ప్రధాని మోడీ ఆపారని బండి సంజయ్ చేసిన ప్రకటన హాస్యాస్పదంగా ఉందని జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్ర హక్కులను పరిరక్షించే లేని దద్దమ్మలు బిజెపి ఎంపీలని జీవన్ రెడ్డి మండిపడ్డారు.

బండి వసూళ్లు త్వరలో బయటపెడతాం

బండి వసూళ్లు త్వరలో బయటపెడతాం


ఇక బీజేపీ కార్యవర్గ సమావేశాల సందర్భంగా బండి సంజయ్ భారీ ఎత్తున వసూళ్లకు పాల్పడ్డాడు అని, త్వరలోనే ఆ చిట్టా బయటకు తెస్తామని జీవన్ రెడ్డి హెచ్చరించారు. అబద్ధాలు చెబుతున్న బిజెపి గ్యాంగ్ ని తరిమికొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని జీవన్ రెడ్డి విమర్శించారు. రైలింజన్లు అమ్ముకునే డబల్ ఇంజన్ ప్రభుత్వం తమకు వద్దని దేశ ప్రజలు నినదిస్తున్నారు అన్న జీవన్ రెడ్డి దేశానికి కేసీఆర్ ప్రధాని కావడం ఖాయం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+