శుభవార్త: ఎఎండీలో ఉద్యోగావకాశాలు

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: అమెరికాకు చెందిన ప్రముఖ చిప్ తయారీ సంస్థ ఎఎండి (అడ్వాన్స్ మైక్రో డివైజెస్) ఇండియాలో కొత్తగా ఉద్యోగులను నియమించుకొనేందుకు రంగం సిద్దం చేసింది.

ఇండియాలో ఈ కంపెనీలో ఇప్పటికే 1300 మంది పనిచేస్తున్నారు. బెంగుళూరు, హైద్రాబాద్‌లలో ఉన్న ఈ రెండు సెంటర్లలో 1300 మంది పనిచేస్తున్నారు.

AMD plans to employ more engineers in India

అయితే హైద్రాబాద్, బెంగుళూరులలోని తమ కార్యాలయాల్లో మరి కొందరిని నియమించుకోవాలని ఎఎండీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జిమ్ అండర్సన్ చెప్పారు.

అయితే ఎంతమందికి ఉద్యోగాలను కల్పిస్తామనే విషయమై ఆ కంపెనీ స్పష్టత ఇవ్వలేదు. కొత్తగా రీసెర్చ్ అండ్ డెవలప్‌సెంటర్ల ఏర్పాటు విషయమై కూడ ఆ కంపెనీ స్పష్టత ఇవ్వలేదు.

ఎక్కువగా అడ్వాన్స్ ఇంజనీరింగ్ పని ఇక్కడే జరుగుతున్నందున ఈ సెంటర్లను బలోపేతం చేయాలని కంపెనీ భావిస్తోంది. ఎఎండీ రైజెస్ మొబైల్ ప్రాసెసర్ కోసం ఎక్కువ ఇంజనీరింగ్ పని హైద్రాబాద్‌లోనే జరుగుతుంది.

ఎఎండీకి భారత్ అత్యంత కీలకమైన మార్కెట్‌. కొత్త ఉత్పత్తులతో తన మార్కెట్‌ షేరును మరింత పెంచుకోవాలని కంపెనీ భావిస్తోంది. వినియోగదారుల పీసీల కోసం రైజెస్ 3, 5 , 7 లను కంపెనీ ఆవిష్కరించింది. కమర్షియల్ పీసీల కోసం రైజెస్ ప్రో అనే కొత్త మైక్రోప్రాసెసర్ చిప్స్‌ను గతవారమే ఎఎండీ మార్కెట్లోకి తెచ్చింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Chipmaker Advanced Micro Devices (AMD), which currently has a staff strength of around 1,300 in India, plans to hire more engineers at its two Research and Development (R&D) centres in Bengaluru and Hyderabad.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X