అమీర్‌పేట మెట్రో రైల్ స్టేషన్‌కు బాంబు బెదిరింపు

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: అమీర్‌పేట్‌ మెట్రో స్టేషన్‌కు ఆదివారం ఉదయం బాంబు బెదిరింపు వచ్చింది. స్టేషన్‌లో బాంబు పెట్టినట్లు పోలీసులకు సమాచారం రావడంతో వెంటనే అప్రమత్తమయ్యారు.

బాంబు స్క్వాడ్ వెంటనే స్టేషన్‌‌కు చేరుకుంది. తనిఖీలు చేపట్టింది. ఉరుకులు, పరుగులు పెట్టిన పోలీసులు, భారీ సంఖ్యలో ఉన్న ప్రయాణికుల మధ్యే బాంబ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టారు.

 Ameerpet Metro Station gets anonymous bomb threat call

ఈ సందర్భంగా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులూ లేకుండా తనిఖీలు చేస్తున్నామని, ఇది ఉత్తుత్తి బెదిరింపు కాల్ అయ్యుంటుందని భావిస్తూనే ముందు జాగ్రత్తగా తనిఖీలు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత తనిఖీల్లో ఎలాంటి బాంబు లేదని తేలింది.

హైదరాబాద్‌ మెట్రోరైలును నవంబర్‌ 28న ప్రధాని మోడీ ప్రారంభించిన విషయం తెలిసిందే. 29 నుంచి ప్రజలకు అందుబాటులోకి వచ్చింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Ameerpet Metro Station gets anonymous bomb threat call.
Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి