నవ్వుకున్నారా?: ఇవాంకాపై నోరు జారిన అధికారి, మీడియా హడావుడి చూసి 'అతి'గా!..

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఇవాంకా పర్యటన విషయంలో భారత ప్రభుత్వం అతి చేసిందా?.. ఆమెకు అంత ప్రాధాన్యత ఇచ్చి ఉండాల్సింది కాదా?.. అమెరికన్ భద్రతా సిబ్బంది మాత్రం ఈ విషయంలో భారత్ తీరుపై ఒకింత ఆశ్చర్యపోయారనే ప్రచారం జరుగుతోంది.

అమెరికా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు ఇక్కడి హడావుడిని చూసి ఆశ్చర్యపోయారట. భద్రత గురించి, ఇవాంకాకు జరుగుతున్న ఏర్పాట్ల గురించి ఇక్కడి మీడియాలో వస్తున్న వార్తలను చూసి వారు నవ్వుకున్నారని ఓ వార్తా కథనం వెలుగులోకి వచ్చింది.

ఎందుకు నవ్వుకున్నారు?:

ఎందుకు నవ్వుకున్నారు?:

ఇవాంకా వస్తున్నరనగానే ఆమె భద్రతా ఏర్పాట్లకు సంబంధించిన అంశాలు మీడియాలో హైలైట్ అయ్యాయి. ఐదంచెల భద్రత ఉంటుందని, దాదాపు 20 సెక్యూరిటీ వాహనాలు అమెరికా నుంచే వస్తాయన్న ప్రచారం జరిగింది. ఇక్కడి వాహనాలతో కలిసి మొత్తం 60వాహనాలు ఆమెకు సెక్యూరిటీగా ఉన్నాయని మీడియా చెప్పింది. కానీ వాస్తవానికి అదేమి జరగలేదు.

ఇవాంకా రాక: ఇంత జరుగుతోందా?, తేల్చుకోలేకపోతున్న హోంశాఖ, ఇవీ ఏర్పాట్లు..

సాధారణ ప్రయాణికురాలి లాగే:

సాధారణ ప్రయాణికురాలి లాగే:

ఇవాంకా అమెరికా నుంచి ప్రత్యేక విమానంలో కాకుండా సాధారణ ప్రయాణికురాలి లాగే వచ్చారు. అమెరికా నుంచి సొంత కాన్వాయ్ ను కూడా తెప్పించుకోలేదు. ఇక్కడి అమెరికా రాయబార కార్యాలయమే ఆమెకు మూడు వాహనాలు సమకూర్చింది. దీంతో భద్రతా ఏర్పాట్లపై ఇక్కడి మీడియా చేసిన అతి చూసి అమెరికన్ సీక్రెట్ ఏజెంట్స్ నవ్వుకున్నారట.
i

ఇవాంకా వచ్చెన్..: సగం టైమ్ 'రిజర్వ్' లోనే.. ఆ టైమ్ వరకు హోటల్లోనే.. ఆ తర్వాతే?

నోరు జారిన అధికారి:

నోరు జారిన అధికారి:

నిజానికి ఇవాంకా ట్రంప్ కు అమెరికాలో అంత పేరేమి లేదని, పైగా తండ్రి లాగే ఆమెను కూడా ఫేక్ అంటారని ఓ అమెరికన్ సీక్రెట్ ఏజెంట్ నోరు జారాడాట. అంతేకాదు, ఇవాంకా కంపెనీలకు చెందిన ఉత్పత్తులను మేసిన్ అనే సంస్థతో పాటు ఆరేడు సంస్థలు నిషేధించాయని కూడా చెప్పుకొచ్చాడట.

మనవాళ్ల పెదవి విరుపు:

మనవాళ్ల పెదవి విరుపు:

అమెరికా భద్రతా అధికారుల తీరుపై భారత అధికారులు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. క్లిష్ట పరిస్థితుల్లో మన పోలీసులే వారి కన్నా మెరుగ్గా పనిచేస్తారని ఇక్కడి అధికారులు చెబుతున్నట్లు సమాచారం.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
American Secret Service agent laughs after seen local media news about Ivanka Trump security, but it was not confirmed officially.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X