రాహుల్ దృష్టికి అన్ని విషయాలు- భారత్ జోడో యాత్రలో రేవంత్..!!
జైపూర్: అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధినేత, లోక్‌సభ సభ్యుడు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర హర్యానాలో సాగుతోంది. ఈ ఏడాది సెప్టెంబర్ 7వ తేదీన తమిళనాడులోని కన్యాకుమారి వద్ద రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను ప్రారంభించిన విషయం తెలిసిందే. కేరళ, కర్ణాటక, ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర మీదుగా రాజస్థాన్‌కు చేరుకుంది. జమ్మూ కాశ్మీర్‌లో ఇది ముగియాల్సి ఉంది.

హర్యానాలో..
ఈ తెల్లవారు జామున 6 గంటలకు హర్యానాలోని సోహ్నా జిల్లా ఖేర్లీ లాలాలో యాత్రను మొదలు పెట్టారు రాహుల్ గాంధీ. భారీ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇందులో పాల్గొన్నారు. రాహుల్ గాంధీతో కలిసి అడుగులో అడుగు వేశారు. భారతీయ జనతా పార్టీ సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉన్న రాష్ట్రం ఇది. ఇక్కడ భారత్ జోడో యాత్రకు అపూర్వ ఆదరణ లభించింది. యాత్ర సాగే మార్గంలో ఎటు చూసినా కాంగ్రెస్ పార్టీ జెండాలు, బ్యానర్లు, విస్తృతంగా కనిపించాయి.

కోవిడ్ నేపథ్యంలో..
ప్రస్తుతం ఈ యాత్ర చుట్టే రాజకీయాలు తిరుగుతున్నాయి. కోవిడ్ విజృంభిస్తోన్న నేపథ్యంలో దీన్ని వాయిదా వేయాలనే డిమాండ్ పెరుగుతోంది. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇదివరకే అఖిల భారత కాంగ్రెస్ కమిటీకి నోటీసులను సైతం పంపించింది. చైనాలో కల్లోలానికి కారణమైన బీఎఫ్ 7 వేరియంట్ కరోనా వైరస్ భారత్‌లో కూడా ప్రవేశించినందున జోడో యాత్రను వాయిదా వేయాల్సి ఉంటుందని తెలిపింది. దీన్ని అంగీకరించట్లేదు కాంగ్రెస్.

రేవంత్, కణిమోళి..
ఈ పరిణామాల మధ్య తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు. ఈ ఉదయం ఆయన ఖేర్లీ లాలాలో రాహుల్ గాంధీని కలిశారు. ఆయనతో పాటు నడిచారు. కాంగ్రెస్ మిత్రపక్షం డీఎంకే నాయకురాలు, రాజ్యసభ సభ్యురాలు కణిమోళి కూడా భారత్ జోడో యాత్రలో కలిశారు. రేవంత్ రెడ్డి, కణిమోళి.. ఇవ్వాళ్టి యాత్రలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.

జోడో యాత్రలో..
రేవంత్ రెడ్డిని తెలంగాణ పీసీసీ నాయకత్వ బాధ్యతల నుంచి తప్పించాలంటూ డిమాండ్ వినిపిస్తోన్న విషయం తెలిసిందే. పీసీసీ నాయకత్వ మార్పుపై ఆ పార్టీ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ ఇప్పటికే సీనియర్లను కలిశారు. వారి అభిప్రాయాలను సేకరించారు. వీ హనుమంతరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. వంటి నాయకులతో మాట్లాడారు.

రాహుల్ హామీ..
ఈ పరిణామాల మధ్య రేవంత్ రెడ్డి- భారత్ జోడో యాత్రలో కనిపించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రాహుల్ గాంధీతో అన్ని విషయాలపైనా ఆయన చర్చించినట్లు తెలుస్తోంది. నాయకత్వ మార్పు గురించి స్పష్టమైన హామీని పొందారనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. అది దిగ్విజయ్ సింగ్ మాటల్లోనే ప్రతిబింబించింది. అధిష్ఠాణం తీసుకునే నిర్ణయానికి పార్టీ నాయకులందరూ కట్టుబడి ఉండాల్సిందేనని ఆయన తేల్చి చెప్పారు. విభేదాలను పక్కన పెట్టి కలిసి పనిచేయాల్సి ఉంటుందని సూచించారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications