చైతూ-సామ్ విడాకుల ప్రకటన ముహూర్తం ఫిక్స్ : ఆ రోజే ఎందుకంటే : భరణంగా ఎంతో తెలుసా..!!
టాలీవుడ్ లో బెస్ట్ కపుల్ గా వ్యవహరించిన సమంత- నాగ చైతన్య జంట విడిపోవటం దాదాపు ఖాయమైంది. కొంత కాలంగా ప్రచారం సాగుతున్నట్లుగా వారిద్దరు విడాకులు తీసుకోవాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ ప్రచారం కొంత కాలంగా సాగుతున్నా నాగార్జున కుటుంబం నుంచి ఇప్పటి వరకు ఖండన లేదు. అయితే, తాజాగా అందుతున్న సమచారం మేరకు వారు తమ విడాకుల నిర్ణయాన్ని సైతం ప్రకటిచేందుకు ముమూర్తం ఖరారు చేసారని తెలుస్తోంది.

చైతూ-సామ్ విడాకులు ఖాయమంటూ
ఇద్దరి మధ్య కొంత కాలంగా కొనసాగుతున్న విభేదాలకు ముగింపు పలికేందుకు నాగార్జునతో సహా కుటుంబంలోని పెద్దలు ప్రయత్నాలు చేసినట్లు సమాచారం. అయినా..ఇద్దరి మధ్య సయోధ్య కుదరలేదని తెలుస్తోంది. దీంతో..చైతూ-సామ్‌ని చాలా సార్లు ఫ్యామిలీ కోర్టుకు తీసుకెళ్లి కౌన్సిలింగ్ కూడా ఇప్పించిన ఎలాంటి ఫలితం లేదని సమాచారం. చై- సామ్ డివోర్స్ ప్రాసెస్ మరో రెండు మూడు నెలల్లో పూర్తి కానుందని చెబుతున్నారు. అయితే, వీరిద్దరి విడాకుల ప్రచారం పైన తాజాగా తిరుమల దర్శనం కు వెళ్లిన సమంతను మీడియా ప్రతినిధులు అడగ్గా.. సమంత సీరియస్ అయ్యారు అటుంటి ప్రశ్నలు ఇక్కడా అడిగేది అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు.

విడాకులకు కారణం అదేనంటూ
అయితే, ఇద్దరి మధ్య కొంత కాలంగా ఇగో సమస్యలే ప్రధాన కారణమని చెబుతున్నారు. ది ఫ్యామిలీ మ్యాన్ 2లో సమంత చాలా బోల్డ్‌గా నటించడంతోనే అసలు వివాదం మొదలైందని తెలుస్తోంది. దీని పైన కుటుంబ సభ్యుల నుంచి తొలుత సూచనలు మొదలై..ఆ తరువాత నటన మానేయమని వరకు వచ్చిందని టాలీవుడ్ టాక్. సమంత సైతం అమల తరహాలోనే ఇంట్లోనే ఉండాలని సైతం చెప్పారంటూ ప్రచారం సాగింది. దీంతో..తొలుత సోషల్ మీడియా అకౌంట్లలో తొలుత తన ఇంటి పేరు తొలిగించిన సమంత.. ఆ తరువాత క్రమేణా చైతన్యతో సంబంధం లేదనే సంకేతాలు అనేకం ఇచ్చారు.

ఇద్దరికీ కౌన్సిలింగ్ పూర్తయినా...
తాజాగా సాయి పల్లవితో కలిసి నాగ చైతన్య నటించిన సినిమా రేపు (24న ) విడుదల కానుంది. ఈ సినిమా విషయంలోనూ సమంత సాయి పల్లవికి అభినందనలు చెప్పారు. కానీ, ఎక్కడా చైతన్య పేరు ప్రస్తావించ లేదు. నాగ చైతన్య మాత్రం తనకు సమంత కావాలని..తనతో కలిసే ఉండాలని చెబుతున్నారని తెలుస్తోంది. ఇక, ఇద్దరి మధ్య సయోధ్య సాధ్యం కాదనే అభిప్రాయానికి కుటుంబ పెద్దలు వచ్చేసినట్లు సమాచారం. అధికారికంగా లీగల్ ప్రాసెస్ పూర్తి కావటానికి మరో రెండు లేదా మూడు నెలల సమయం తీసుకొనే అవకాశం ఉంది.

విడాకులు - భరణం పైన నిర్ణయం ఇదే..
దీంతో.. వారి వివాహం రోజు అయిన అక్టోబర్ 7నే తమ విడాకుల ప్రకటన సోషల్ మీడియా ద్వారా చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. 2017, అక్టోబర్ 7న వారిద్దరి వివాహం జరిగింది. అయితే, ఇదే సమయంలో సమంతకు భరణంగా ఎంత ఇస్తున్నారనేది ఆసక్తి కర చర్చకు దారి తీసింది. అన్ని రకాలుగా ఆస్తులు..ఇతరత్రా కలిపి భరణంగా 50 కోట్లు ఇవ్వనున్నట్లు చెబుతున్నారు. అయితే, సినిమా సర్కిల్స్ లో మాత్రం దాదాపుగా 300 కోట్ల వరకు భరణంగా ఇవ్వనున్నట్లు వినిపిస్తోంది. దీంతో..వీరిద్దరి వైవాహిక జీవితం ముగిసినట్లేనని టాలీవుడ్ టాక్. కానీ, వాస్తవం ఏంటనేది మాత్రం ఆ ఇద్దరే చెప్పాలి. లేదా అక్టోబర 7వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.












Click it and Unblock the Notifications