కర్ణాటకలోనూ, తెలంగాణాలోనూ అధికారం మాదే: అమిత్ షా ధీమా!!

కర్ణాటక రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన పార్టీలన్నీ ప్రచార పర్వాన్ని ముమ్మరం చేశాయి. బిజెపి నుండి కీలక నేతలు కర్ణాటకలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. హోరా హోరీగా సాగుతున్న ఎన్నికల ప్రచారంలో అమీతుమీ తేల్చుకోవటానికి కర్ణాటకలోని రాజకీయ పార్టీలన్నీ రెడీ అయ్యాయి. కర్ణాటక ఎన్నికల నేపధ్యంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ తనదైన శైలిలో ప్రచార పర్వాన్ని కొనసాగిస్తున్నారు.

ఇక తాజాగా అమిత్ షా కర్ణాటకలో ఎన్నికల ప్రచారం సందర్భంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఉద్దేశించి కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికలలో కర్ణాటక రాష్ట్రంలోనే కాదు తెలంగాణ రాష్ట్రంలో కూడా పూర్తి మెజారిటీ సాధిస్తామని అమిత్ షా పేర్కొన్నారు. కర్ణాటకలో బిజెపి అధికారంలోకి రావడం ఖాయమని చెప్పిన అమిత్ షా, డబల్ ఇంజిన్ ప్రభుత్వంపై కర్ణాటక ప్రజలకు పూర్తి నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశారు.

amith

తెలంగాణలో సైతం పూర్తి మెజారిటీతో గెలుస్తామని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. దక్షిణాదిలో బీజేపీ బలపడుతుందని పేర్కొన్న ఆయన కర్ణాటకతో పాటు తెలంగాణ రాష్ట్రంలో కూడా అధికారంలోకి వస్తామని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే రేపు తెలంగాణ రాష్ట్రంలో అమిత్ షా పర్యటన సాగనుంది. కర్ణాటకలో ఎన్నికల ప్రచారాన్ని ముగించుకున్న అనంతరం రేపు సాయంత్రం అమిత్ షా హైదరాబాద్ కు రానున్నారు.

అమిత్ షా పర్యటనలో భాగంగా ఆర్ ఆర్ ఆర్ సినిమా బృందంలోని ప్రముఖులతో ఆయన భేటీ అవుతారు. ఆపై పార్లమెంటు ప్రవాస్ యోజనలో భాగంగా చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో పర్యటించి, చేవెళ్ల లో నిర్వహించే భారీ బహిరంగ సభలో అమిత్ షా పాల్గొంటారు. ఈ మేరకు బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. భారీగా జనసమీకరణ చేపట్టనున్నారు. అమిత్ షా పర్యటనను, బహిరంగ సభను సక్సెస్ చెయ్యాలని పార్టీ శ్రేణులకు, ప్రజలకు పిలుపునిస్తున్నారు. తెలంగాణా పర్యటనతో అమిత్ షా తెలంగాణాలోనూ ఎన్నికలకు దిశా నిర్దేశం చెయ్యనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+