టూరిస్ట్ ప్లేస్‌గా భువనగిరి ఖిల్లా: తెలంగాణ ఎన్నికల ప్రచారంలో అమిత్ షా కీలక హామీలు

నల్గొండ: తెలంగాణలో రాజకీయాలు కలుషితమయ్యాయన్నారు కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా రామగిరిలో ఏర్పాటు చేసిన సకల జనుల విజయ సంకల్ప సభలో అమిత్ షా పాల్గొని ప్రసంగించారు. భువనగిరి ఖిల్లాను కేసీఆర్ అభివృద్ధి చేయలేదని మండిపడ్డారు.

బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత రూ. 50 కోట్లతో భువనగిరి ఖిల్లాను అభివృద్ధి చేస్తామని, పర్యాటక ప్రాంతంగా మారుస్తామని అమిత్ షా చెప్పారు. అంతేగాక, మూసీ నదిని శుద్ధి చేస్తామన్నారు. పోచంపల్లి గ్రామంలో వినోబాబావే భూదాన ఉద్యమం చేస్తే.. కేసీఆర్ భూములను కబ్జా చేస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ కు వీఆర్ఎస్ ఇచ్చే సమయం ఆసన్నమైందన్నారు.

 Amit shah hits out at brs and congress in ramagiri and maktal public meetings

కాళేశ్వరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించే విషయమై ప్రధాని నరేంద్ర మోడీని కేసీఆర్ ఎప్పుడూ కలవలేదన్నారు అమిత్ షా. మిషన్ భగీరథలో, కాళేశ్వరం ప్రాజెక్టులో కుంభకోణం చేశారని ఆరోపించారు. 2014, 2018లో కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్‌లోకి వెళ్లారన్నారు. తెలంగాణలో బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని బీజేపీ వాగ్ధానం చేసిందని గుర్తు చేశారు అమిత్ షా.

ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని అమిత్ షా స్పష్టం చేశారు. తెలంగాణలో అధికారమిస్తే పెట్రోల్, డీజిల్ చౌకగా అందిస్తామన్నారు. అయోధ్యలో 2019లో భూమి పూజ చేశామని.. 2024లో రామ మందిరం, రాముడికి ప్రాణప్రతిష్ఠ చేస్తామని అమిత్ షా తెలిపారు. తెలంగాణలో ఈసారి బీజేపీకి ఓటేయాలని ప్రజలను కోరారు.

మరోవైపు, నారాయణపేట జిల్లా మక్తల్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలోనూ పాల్గొని ప్రసంగించారు అమిత్ షా. తెలంగాణలో కాంగ్రెస్.. బీఆర్ఎస్‌కు బీ టీం వంటిందని అన్నారు. ఆ రెండు పార్టీలు ఎప్పుడూ తమ వారసుల గురించే ఆలోచిస్తాయన్నారు. ఢిల్లీలో రాహుల్‌ను, రాష్ట్రంలో కేటీఆర్‌ను పదవిలో కూర్చోబెట్టాలని చూస్తున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే.. ఆ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ కు అమ్ముడు పోతారన్నారు.

ఈ అసెంబ్లీ ఎన్నికలు తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేవని అన్నారు అమిత్ షా. కేసీఆర్ పదేళ్ల పాలన పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని విమర్శించారు. మంత్రులు, ఎమ్మెల్యేల భూ కబ్జాలకు అడ్డులేకుండా పోయిందని ధ్వజమెత్తారు. ప్రజల పనులు చేయకుండా దందాలు చేయడమే బీఆర్ఎస్ ఎమ్మెల్యే విధానమని విమర్శించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే.. మక్తల్, నారాయణపేటలో టెక్స్‌టైల్ పార్కులు ఏర్పాటు చేస్తామన్నారు. మత్స్యకారుల కోసం నిధులు, ప్రత్యేక శాఖను ఏర్పాటు చేస్తామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+