మెదక్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పొత్తులపై రేవంత్ రెడ్డి, జైపాల్ రెడ్డిలకు దిగ్విజయ్ షాక్

రానున్న ఎన్నికల్లో టిడిపితో పెట్టుకొంటామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎస్. జైపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్. కాంగ్రెస్ పార్ట

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రానున్న ఎన్నికల్లో టిడిపితో పెట్టుకొంటామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎస్. జైపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్. కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందన్నారు. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒంటరిగానే పోటీచేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్.

రానున్న ఎన్నికల్లో అవసరమైతే టిడిపితో పొత్తు పెట్టుకొంటామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎస్. జైపాల్ రెడ్డి ప్రకటించారు. అయితే ఈ ప్రతిపదనను కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నాయకులు కూడ వ్యతిరేకించారు.

ఎస్. జైపాల్ రెడ్డి వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీని బలహీనపర్చేవిధంగా ఉన్నాయని పార్టీ నాయకులు విమర్శించారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఎవరితోనూ పొత్తు పెట్టుకోదని దిగ్విజయ్ సింగ్ ప్రకటించారు. రానున్న ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే పోటీచేస్తోందని ఆయన ప్రకటించారు.

తెలంగాణలో తెలుగుదేశం పార్టీతో పొత్తుండదని బిజెపి ప్రకటించిన వెంటనే కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీచేసేందుకు కూడ సిద్దమేనని టిడిపి తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ప్రకటించారు.అయితే ఈ ప్రతిపాదనకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎస్. జైపాల్ రెడ్డి సానుకూలంగా స్పందించారు.టిడిపి అంటరాని పార్టీ కాదన్నారు.

టిడిపితో పొత్తు ఎలా పెట్టుకొంటాం

టిడిపితో పొత్తు ఎలా పెట్టుకొంటాం

తెలంగాణలో టిడిపితో పొత్తు ఎలా పెట్టుకొంటామని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహరాల ఇంచార్జ్ దిగ్విజయ్ ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టిడిపితో పోరాటం చేస్తున్నామన్నారు. తెలంగాణలో కూడ ఆ పార్టీ తమకు శత్రువే. అలాంటి పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏముందని కాంగ్రెస్ పార్టీ వ్యవహరాల ఇంచార్జ్ దిగ్విజయ్ సింగ్ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో బలంగా ఉందన్నారు. ఒంటరిగానే తాము ఎన్నికలకు దిగుతామన్నారు దిగ్విజయ్ సింగ్.కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జ్ ను తానేనని చెప్పారు. పొత్తుల గురించి మాట్లాడాల్సింది ఎవరని ఆయన ప్రశ్నించారు.

అమిత్ షా టూర్ బిగ్ ప్లాప్ షో

అమిత్ షా టూర్ బిగ్ ప్లాప్ షో

తెలంగాణ రాష్ట్రంలో బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మూడు రోజుల పర్యటన బిగ్ ప్లాప్ షో పర్యటన అని ఆయన చెప్పారు. అమిత్ షా టూర్ మీడియా పెద్దగా హైప్ చేసిందన్నారు. కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయన్నారు దిగ్విజయ్ సింగ్.తెలంగాణలో హిందూత్వను పెంచిపోషించేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. అయితే బిజెపిని ప్రజలు తిరస్కరిస్తారని చెప్పారు.

దిగ్విజయ్ ప్రకటనతో పొత్తుపై

దిగ్విజయ్ ప్రకటనతో పొత్తుపై

తెలంగాణలో రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్, టిడిపిలు కలిసి పోటీచేస్తాయనే చర్చకు తాత్కాలికంగా బ్రేక్ పడినట్టైంది. టిడిపితో పొత్తును దిగ్విజయ్ సింగ్ వ్యతిరేకించారు.ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించారు.అయితే తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడ ఈ ప్రతిపాదనను సమర్ధించారు. అయితే బిజెపి, టిఆర్ఎస్ ల కు వ్యతిరేకంగా కలిసివచ్చే పార్టీలను కలుపుకుపోతామని ఉత్తమ్ ప్రకటించారు. అయితే దిగ్విజయ్ ప్రకటనతో పొత్తులపై మళ్ళీ మొదటికొచ్చింది.

మహాకూటమికి బ్రేక్

మహాకూటమికి బ్రేక్

2019 ఎన్నికల్లో టిఆర్ఎస్ కు వ్యతిరేకంగా కలిసివచ్చే పార్టీలతో మహాకూటమిని ఏర్పాటుచేసేందుకుగాను ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. బీహార తరహాలో విపక్షాల ఓట్లు చీలిపోయి టిఆర్ఎస్ కు కలిసిరాకుండా ఉండేందుకు గాను విపక్షాలు కూటమి లేదా పొత్తు ఏర్పాటుచేసుకొని పోటీచేయాలని భావిస్తున్నాయి. అయితే సిపిఎం ఈ తరహా ప్రయత్నాన్ని ఇప్పటికే ప్రారంభించింది.అదే సమయంలో కాంగ్రెస్, టిడిపిలు కూడ పొత్తు పై సానుకూలంగా స్పందించాయి.అయితే దిగ్విజయ్ ప్రకటనతో ఈ రెండు పార్టీల మధ్య పొత్తు విషయమై రానున్న రోజుల్లో ఏం జరుగుతోందనే ఉత్కంఠ నెలకొంది. అయితే విపక్షాల మధ్య ఓట్ల చీలిక జరగకుండా ఉండేందుకుగాను కూటమి ఏర్పాటు ప్రతిపాదనకు బ్రేక్ పడే అవకాశం లేకపోలేదనే అభిప్రాయాలు కూడ వ్యక్తమౌతున్నాయి.అయితే రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరుగవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

English summary
Terming BJP national president Amit Shah’s recent tour in Telangana state as a ‘big flop’, AICC general-secretary Digvijay Singh on Thursday said that though the BJP created a media hype about the visit and on several Opposition leaders joining the BJP, it was ultimately proven a huge drama.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X