చివరి నిమిషంలో... అమిత్ షా తెలంగాణ పర్యటన రద్దు
భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా తెలంగాణ పర్యటన చివరి నిమిషంలో రద్దయింది. రేపు (శుక్రవారం) ఆయన రావాల్సి ఉంది. అయితే ఢిల్లీలో ముఖ్య నేతలతో భేటీ ఉండటంతో ఆయన పర్యటన రద్దు చేసుకున్నారు.
హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా తెలంగాణ పర్యటన చివరి నిమిషంలో రద్దయింది. రేపు (శుక్రవారం) ఆయన రావాల్సి ఉంది. అయితే ఢిల్లీలో ముఖ్య నేతలతో భేటీ ఉండటంతో ఆయన పర్యటన రద్దు చేసుకున్నారు.

రేపటి నుంచి తెలంగాణలో బీజేపీ పార్లమెంట్ నియోజకవర్గాల సమావేశాలు జరుగుతున్నాయి. ఈ నెల 19వ తేదీ వరకు జరుగుతాయి. వీటికి అమిత్ షా హాజరవ్వాల్సి ఉంది. అయితే, ఇప్పుడు రద్దవటంతో ఆయన మళ్లీ ఎప్పుడు పర్యటిస్తారో స్పష్టత రాలేదు.












Click it and Unblock the Notifications