కేటీఆర్ ఆలోచన ఇదే: మూడు దశల్లో సాగర్ ప్రక్షాళన ఎలా చేస్తారంటే
హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు మంత్రి కేటీఆర్ ఏమైతే హామీలు ఇచ్చారా ఆ హామీల అమలు దిశగా దృష్టి సారించారు. ముందుగా హైదరాబాద్‌కు తలమానికమైన హుస్సేన్‌సాగర్‌ను మంచినీటి సరస్సుగా మార్చి తీరుతామని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.
హుస్సేన్‌సాగర్ ప్రక్షాళనకోసం రూ.2.48కోట్లతో మలేషియా నుంచి దిగుమతి చేసిన ఆంపీబియోస్ ఎక్స్‌వేటర్ యంత్రాన్ని సంజీవయ్యపార్క్ తీరంలో మంత్రి తలసాని, మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్ధీన్, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్‌లతో కలిసి మంగళవారం ఆయన ప్రారంభించారు.

కేటీఆర్ ఆలోచన ఇదే: మూడు దశల్లో సాగర్ ప్రక్షాళన ఇలా చేస్తారు
అనంతరం మీడియాతో మాట్లాడుతూ సాగర్ ప్రక్షాళనను మూడు దశల్లో చేపడుతున్నామని ఆయన చెప్పారు. సాగర్ ప్రక్షాళనకు జైకా సంస్ధ నుంచి రూ. 310 కోట్లు వచ్చాయని, ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.100 కోట్లు కేటాయించిందని తెలిపారు. రూ.57 కోట్లతో కూకట్‌పల్లి నాలా డైవర్షన్ పనులను దాదాపు పూర్తి చేశామని ఆయన చెప్పారు.

కేటీఆర్ ఆలోచన ఇదే: మూడు దశల్లో సాగర్ ప్రక్షాళన ఇలా చేస్తారు
తొలిదశలో చేపట్టిన కూకట్‌పల్లి నాలా డైవర్షన్ పనులు 99శాతం పూర్తయ్యాయని, రెండో దశలో సాగర్ క్లీనింగ్ పనులు చేపడుతామని, మూడో దశలో సుందరీకరించి మాన్‌సూన్ రెగట్టా, సెయిలింగ్ పోటీల వేదికగా తీర్చిదిద్దుతామని ఆయన చెప్పారు.

కేటీఆర్ ఆలోచన ఇదే: మూడు దశల్లో సాగర్ ప్రక్షాళన ఇలా చేస్తారు
రెండోవిడతలో క్లీనింగ్ పనులను చేపట్టడం జరుగుతుందని, సరస్సులో అక్సిజన్ లెవల్ పెంచేందుకు అధునాతన ట్రాష్ కలెక్టర్, ఏరోవేటర్స్ యంత్రాలు రాబోతున్నాయని వివరించారు. మూడో విడతలో చుక్క మురుగునీరు రాకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేసి సుందర సాగరంగా తీర్చి దిద్దుతామని చెప్పారు.

కేటీఆర్ ఆలోచన ఇదే: మూడు దశల్లో సాగర్ ప్రక్షాళన ఇలా చేస్తారు
మూసీ సుందరీకరణకు రూ.3 వేల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశామని మంత్రి కేటీఆర్ చెప్పారు. గ్రేటర్ నుంచి 93శాతం జలవ్యర్థాలు మూసీలో కలుస్తున్నాయని చెప్పారు. రోజూ 1300 ఎంఎల్‌డీ మేర ద్రవ వ్యర్థాలు ఉత్పత్తి అవుతుండగా, 650ఎంఎల్‌డీ మేర మాత్రమే శుద్ధి జరుగుతుందన్నారు.

కేటీఆర్ ఆలోచన ఇదే: మూడు దశల్లో సాగర్ ప్రక్షాళన ఇలా చేస్తారు
మూసీ ప్రక్షాళనకు మరో 10 ఎస్టీపీ(మురుగునీటి శుద్ధి) కేంద్రాలు అవసరమని అన్నారు. గార్డెనింగ్, రైల్వే బోగీల క్లీనింగ్, భవన నిర్మాణాలకు శుద్ధి చేసిన మురుగునీటిని వినియోగించేలా అవసరమైతే చట్టం లేదా ప్రత్యేక జీవోను తీసుకువస్తామని చెప్పారు.

కేటీఆర్ ఆలోచన ఇదే: మూడు దశల్లో సాగర్ ప్రక్షాళన ఇలా చేస్తారు
సాగర్‌తోపాటు పర్యావరణాన్ని కూడా పరిరక్షించేందుకు అందరం మట్టి గణపతులనే పూజిద్దామని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. అలాగే 20 అడుగులకు మించని గణపతులనే నిలబెడదామని సూచించారు. దీనిపై గణేష్ ఉత్సవ సమితి, ఇతర ఎన్టీవో, స్వచ్ఛంద సంస్థలతో చర్చలు జరుపుతామని చెప్పారు.

బెంగళూరులో నాలుగైదు చోట్ల కొలనులు నిర్మించి నిమజ్జనాలు చేసే పద్ధతి ఉందని ఇక్కడా అలాంటి నిమజ్జనాలకు పరిశీలన చేస్తామని చెప్పారు. హరితహారం కింద తొలకరి జల్లులు పడే సమయానికి జీహెచ్‌ఎంసీ పరిధిలో ఒకేరోజు 25 లక్షల మొక్కలు నాటాలని నిర్ణయించామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

కేటీఆర్ ఆలోచన ఇదే: మూడు దశల్లో సాగర్ ప్రక్షాళన ఇలా చేస్తారు
స్వచ్ఛ హైదరాబాద్ తరహాలో చేపట్టే ఈ కార్యక్రమంలో విద్యా సంస్థలు, ఎన్టీవోలు, స్వచ్ఛంద సంస్థలను భాగస్వామం చేస్తామమన్నారు. తొలకరి జల్లులు పడే నాటికి సాగర్‌లోని పూడికతీత పనులు పూర్తి చేయాలని హెచ్‌ఎంసీ అధికారులను ఆదేశించామని అన్నారు. దీంతో రూ.29కోట్లతో పనులు జరుగుతున్నాయని చెప్పారు.

కేటీఆర్ ఆలోచన ఇదే: మూడు దశల్లో సాగర్ ప్రక్షాళన ఇలా చేస్తారు
ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతల ఏర్పాటును తప్పనిసరి చేసే యోచన ఉందని, ఇక నుండి ఇంకుడుగుంత నిర్మిస్తేనే భవన నిర్మాణ అనుమతులు జారీ చేయాలనే నిబంధన తేచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. వంద రోజుల ప్రణాళికలో భాగంగా నగరంలో వెయ్యి ఇంకుడు గుంతలుఏర్పాటు చేస్తున్నామన్నారు.

కేటీఆర్ ఆలోచన ఇదే: మూడు దశల్లో సాగర్ ప్రక్షాళన ఇలా చేస్తారు
ఈ కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి, స్పెషల్ సీఎస్ ఎంజీ గోపాల్, టీఆర్‌ఎస్ కార్పొరేటర్లు పీ విజయారెడ్డి, శేషుకుమారి, టీఆర్‌ఎస్ గ్రేటర్ మాజీ అధ్యక్షుడు కట్టెల శ్రీనివాస్ యాదవ్, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ కమిషనర్లు జనార్థన్ రెడ్డి, టీ చిరంజీవులు, హెచ్‌ఎండీఏ సీఈ బీఎల్‌ఎన్ రెడ్డి, డైరెక్టర్ స్వర్గం శ్రీనివాస్, అధికారులు పరంజ్యోతి, అప్పారావు, కుమారస్వామి, కృష్ణ పాల్గొన్నారు.

Click it and Unblock the Notifications