Amrit Bharat Express: చర్లపల్లి అమృత్ భారత్ రైలు కొత్త టైమింగ్స్..! 27 నుంచి అమల్లోకి..!
చర్లపల్లి-తిరువనంతపురం నార్త్ స్టేషన్ల మధ్య ప్రయాణించేలా తాజాగా ప్రధాని మోడీ ప్రారంభించిన అమృత్ భారత్ వీక్లీ ఎక్స్ ప్రెస్ (amrit bharat Express) రైలుకు తాత్కాలిక షెడ్యూల్ మాత్రమే ఇచ్చారు. అయితే ఇప్పుడు రైల్వేశాఖ ఈ రైలు రెగ్యులర్ షెడ్యూల్ ను విడుదల చేసింది. చర్లపల్లి నుంచి తిరువనంతపురం వరకూ సాగే ఈ ఎక్స్ ప్రెస్ ప్రయాణం ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎప్పుడు ముగుస్తుంది, ఏయే హాల్ట్ లలో ఏ సమయానికి ఈ రైలు వస్తుందన్న వివరాలు ఇందులో ఉన్నాయి.
ఈ నెల 27 నుంచి చర్లపల్లి-తిరువనంతపురం నార్త్ అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్ల సమయాల్లో మార్పులు చోటు చేసుకోనున్నాయి. తాజా షెడ్యూల్ ప్రకారం చర్లపల్లిలో ప్రతీ మంగళవారం ఉదయం 7.15కు ఈ రైలు తిరువనంతపురానికి బయలుదేరబోతోంది. అక్కడి నుంచి 8.37కు నల్గొండలో, 9.06కు మిర్యాలగూడలో, 11.39కి సత్తెనపల్లిలో, 12.20కి గుంటూరులో, 1.43కు తెనాలిలో, 2.28కి బాపట్లలో, 3.48కి ఒంగోలులో, 5.23కి నెల్లూరులో, సాయంత్రం 7.20కి రేణిగుంటలో ఆగనుంది. గమ్యస్ధానమైన తిరువనంతపురానికి మరుసటి రోజు మధ్యాహ్నం 2.45కు చేరుతుంది.

అలాగే తిరువనంతపురం నార్త్ లో ఈ నెల 28న బుధవారం చర్లపల్లికి అమృత్ భారత్ రైలు మధ్యాహ్నం 2.45కు బయలుదేరుతుంది. అక్కడి నుంచి తమిళనాడు మీదుగా ఏపీలోకి మరుసటి రోజు ఉదయం ప్రవేశిస్తుంది. ఉదయం 10.40కి రేణిగుంటలో, 1.03కి నెల్లూరులో, 2.43కి ఒంగోలులో, 3.28కి ఒంగోలులో, 4.43కి తెనాలిలో, 5.40కి గుంటూరులో, 6.59కి సత్తెనపల్లిలో, 8.59కి మిర్యాలగూడలో, 9.29కి నల్గొండలో ఆగుతుంది. చివరికి రాత్రి 11.30కి చర్లపల్లికి ఈ రైలు చేరుకుంటుంది.

ఈ రైలు రెండు వైపులా 8 స్లీపర్ క్లాస్ కోచ్ లు, 11 జనరల్ సెకండ్ క్లాస్ కోచ్ లు, 1 ప్యాంట్రీ కార్, దివ్యాంగుల కోసం రెండు సెకండ్ క్లాస్ కోచ్ లు ఉంటాయి. ఈ రైలులో ప్రయాణించే వారి కోసం ఇప్పటికే అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ ఆదివారమే ప్రారంభమయ్యాయి. దక్షిణాదిలోని నాలుగు రాష్ట్రాలను కనెక్ట్ చేస్తూ ప్రారంభించిన ఈ అమృత్ భారత్ రైలుకు మంచి ఆదరణ లభిస్తుందని రైల్వేశాఖ అంచనా వేస్తోంది.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications