ఇంద్ర భవనాల్లా అమృత్ భారత్ రైల్వేస్టేషన్లు!
తెలంగాణ రాష్ట్రంలో రైల్వే యొక్క రూపురేఖలను అమృత్ భారత్ స్టేషన్లు మారుస్తున్నాయి. భారతీయ రైల్వే మిషన్లో భాగంగా అమృత్ భారత్ స్టేషన్స్ స్కీమ్ లో భాగంగా దేశవ్యాప్తంగా 1275 రైల్వే స్టేషన్లను తిరిగి అన్ని మౌలిక వసతులతో ఆధునీకరిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల రైల్వే సౌకర్యం కోసం అమృత్ భారత్ స్టేషన్ లు సుందరంగా ముస్తాబవుతున్నాయి. ఇంద్ర భవనాల్లా తయారవుతున్నాయి.
తెలంగాణా రైల్వే రూపురేఖలు మారుస్తున్న అమృత్ భారత్ స్టేషన్లు
తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే అమృత్ భారత్ స్టేషన్ ల అభివృద్ధి కోసం 2,245 కోట్ల రూపాయలను ఖర్చు పెడుతోంది రైల్వే. మొత్తం 40 స్టేషన్ల అభివృద్ధికి ఈ నిధులను కేటాయించింది. తెలంగాణ రాష్ట్రంలో 2024 సంవత్సరంలో కొత్తగా 15 అమృత భారత్ స్టేషన్లను నిర్మించటానికి ప్రధాని మోడీ శంకుస్థాపన కూడా చేశారు.

తెలంగాణలో రైల్వే స్టేషన్ లతో పాటు అనేక పనులు చేస్తున్న రైల్వే
తెలంగాణా రాష్ట్ర రైల్వే వ్యవస్థను అప్ గ్రేడ్ చేస్తున్నట్టు ప్రకటించిన రైల్వే అందులో భాగంగా అమృత భారత్ స్టేషన్లతో పాటు రైల్వే ఫ్లైఓవర్లు అండర్ పాస్ లు కూడా నిర్మిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్, బాసర, బేగంపేట్, భద్రాచలం రోడ్, హైదరాబాద్, జడ్చర్ల, జనగాం, కాచిగూడ, కామారెడ్డి, గద్వాల్, హఫీజ్ పేట, హైటెక్ సిటీ, హుప్పు గూడ, కరీంనగర్, లింగంపల్లి స్టేషన్ లను ఆధునీకరించి, అందంగా ముస్తాబు చేస్తున్నారు.
Recently went to Warangal. Nice to see such a wonderful railway station.
— Ⓜ️ishratwitte (@Mishratwitte) September 2, 2023
1st time kisi Railway station ko dekh dil khush ho gya 🙂
Great work @RailMinIndia 👏🙏 pic.twitter.com/r1iTccUEny
అమృత్ భారత్ స్కీం లో ఆధునికీకరిస్తున్న రైల్వే స్టేషన్లు
కాజీపేట జంక్షన్, వరంగల్, ఖమ్మం, మధిర, మహబూబాబాద్, మెహబూబ్ నగర్, మలక్పేట, మల్కాజ్ గిరి, మేడ్చల్, మిర్యాలగూడ, నల్గొండ, నిజామాబాద్, పెద్దపల్లి, సికింద్రాబాద్, షాద్నగర్, శ్రీ బాల బ్రహ్మేశ్వర జోగులాంబ, రామగుండం, తాండూరు, ఉందా నగర్, వికారాబాద్, యాదాద్రి, జహీరాబాద్, యాకుత్పురా మొత్తం 40 స్టేషనులను అమృత్ భారత్ స్కీములో భాగంగా అభివృద్ధి చేస్తున్నారు.
ప్రపంచ స్థాయి రైల్వే స్టేషన్‌గా బేగంపేట స్టేషన్
అమృత్‌భారత్‌స్టేషన్ పథకం కింద బేగంపేట రైల్వే స్టేషన్‌ను ప్రపంచ స్థాయి రైల్వే స్టేషన్‌గా మార్చనున్నారు.మోదీ ప్రభుత్వం రూ.22.57 కోట్లతో బేగంపేట స్టేషన్‌ను పునరుద్ధరిస్తోంది. ప్రయాణీకులకు అత్యున్నతమైన సౌకర్యాలు అందించటం, ఆధునికంగా మార్చటం కోసం పనులు జరుగుతున్నాయి.

తెలంగాణా రాష్ట్ర రైల్వే ప్రగతికి అద్దం పట్టేలా రైల్వే స్టేషన్లు
ఇప్పటికే వరంగల్, కాజీపేట,మంచిర్యాల, యాకుత్పురా, తాండూరు, బెంగంపేట తో పాటు అన్ని రైల్వే స్టేషన్లు సర్వాంగ సుందరంగా రెడీ అవుతున్నాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని అమృత్ భారత్ స్టేషన్ల పనులు పూర్తికాగా , మరికొన్ని పనులు కొనసాగుతున్నాయి. ఇవన్నీ పూర్తయితే మన రైల్వే స్టేషన్లు తెలంగాణా రాష్ట్ర రైల్వే ప్రగతికి అద్దం పడతాయి.












Click it and Unblock the Notifications