వారికి కేంద్రం అదనపు డబ్బులు..తెలంగాణా, ఏపీ ప్రజలకు పండుగే!
సామాన్యులకు, నైపుణ్యంలేని శారీరక శ్రమ చేసే వారికి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ఉన్న కూలీలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును మార్చడమే కాకుండా, ఉపాధి హామీ కూలీలకు కేంద్రం పండుగ లాంటి వార్త చెప్పింది.
125 రోజులపాటు ఉపాధి హామీ
'వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ)' గా ఉపాధి హామీ పథకం పేరును మార్చిన కేంద్రం గ్రామీణ కుటుంబాలకు మరింత ఉపాధి హామీని కల్పించి వారి బతుకుకు భరోసా ఇవ్వనుంది. ఇప్పటివరకు ఎంఎన్ఆర్ఇజిఎ కింద సంవత్సరానికి 100 రోజులు ఉపాధి హామీ లభించేది. అయితే తాజాగా కేంద్ర ప్రవేశపెట్టిన కొత్త బిల్లుతో సంవత్సరానికి 125 రోజులపాటు ఉపాధి హామీ కల్పించడానికి నిర్ణయించింది.

25 రోజులు పని దినాలు పెంపుతో అదనపు ఆదాయం
25 రోజులు పని దినాలు పెంచడంతో వాతావరణ ప్రతికూలతలు మరియు వానా కాలం సీజన్ మినహాయించి ఏడాది పొడవునా ఉపాధి హామీ కూలీలకు పనులు ఉండనున్నాయి. ప్రస్తుతం ఉపాధి హామీ కూలీలకు రోజుకు 307 రూపాయలు చొప్పున చెల్లిస్తున్నారు. అయితే ఈ కూలి విషయంలో కేంద్రం నిర్ణయం తీసుకుంటుందా, రాష్ట్ర ప్రభుత్వాల మీదనే వదిలేస్తుందా అనేది తెలియాల్సి ఉంది.
ఉపాధి హామీ పనులతో గ్రామాలు అభివృద్ధి
ఈ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి అవకాశం కల్పించడంతోపాటు, సంబంధిత పనులలో ప్రజలకు ఉపాధి లభిస్తుందని కేంద్రం చెబుతుంది. తాగునీటి సాగునీటి వనరులను మెరుగుపరుచుకుని, రోడ్లు, నీటికి సంబంధించిన మౌలిక సదుపాయాలు వంటి పనులకు ప్రాధాన్యతను ఇచ్చి ఉపాధి హామీ పనులు చేయించడం వల్ల గ్రామాలు కూడా అభివృద్ధి చెందుతాయని కేంద్రం చెబుతుంది.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో అదనంగా 64. 65 కోట్ల రూపాయల లబ్ధి
దీనివల్ల కూలీలకు మాత్రమే కాదు రైతులకు కూడా లబ్ధి చేకూరుతుంది. కొత్త బిల్లు మరింత పారదర్శకతను తీసుకువస్తుందని, ప్రజలలో జవాబుదారీతనాన్ని మరింత పెంచుతుందని ప్రభుత్వం చెబుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో తీసుకున్నట్లయితే ఉపాధి హామీ పథకం ద్వారా 7.10 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో అదనంగా 64. 65 కోట్ల రూపాయల లబ్ధి జరగనుంది.
దేశ వ్యాప్తంగా వారికి పండుగే
ఒక్క ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే పరిస్థితి ఇలా ఉంటే తెలుగు రాష్ట్రాలలోనూ, దేశవ్యాప్తంగాను ఎంత మేర తాజాగా మార్పులు చేసిన ఉపాధి హామీ పథకంతో లబ్ధి చేకూరుతుంది అనేది అర్థం చేసుకోవచ్చు. ఈ కొత్త బిల్లు సామాన్యులకు భరోసా కల్పిస్తుందని, మరింత పారదర్శకతను తీసుకువస్తుందని, జవాబుదారీతనాన్ని పెంచుతుందని ప్రభుత్వం చెబుతోంది.
-
PM Modi: సీఎంలకు మోడీ సందేశం ఇదే..! మళ్లీ ఆ కోవిడ్ మోడల్..! -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
మార్కాపురం బస్సు ప్రమాద బాధితుల కోసం ప్రధాని కీలక ప్రకటన..!! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications