ఇంజనీరింగ్ చేసి.. గర్ల్‌ఫ్రెండ్‌తో దర్జాగా బతకాలని.. హైదరాబాద్‌లో ఓ రొమాంటిక్ క్రైమ్ కథ
వాళ్లిద్దరూ చిన్ననాటి స్నేహితులు.. స్కూల్ పూర్తయ్యేనాటికి ప్రేమికులు.. ఆమె ఇంటర్ లో ఫెయిలై చదువు ఆపేయగా.. అతను మాత్రం కష్టపడి ఇంజనీరింగ్ పూర్తిచేశాడు.. హైదరాబాద్ లో ఉంటూ హ్యాపీగా కలిసితిరిగేవాళ్లు.. రానురాను జల్సాలకు అలవాటుపడ్డారు.. డబ్బుల అవసరం పెరిగింది.. దీంతో క్రైమ బాట పట్టారు.. పోలీసులకు చిక్కకుండా చాలా దొంగతనాలు చేశారు.. కానీ ప్రతి క్రైమ్ కథలో జరిగినట్లే అనూహ్యంగా పట్టుపడ్డారు.. రాచకొండ పోలీసులు మీడియాకు వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి..

ఇద్దరూ ఇద్దరే
ఖమ్మం జిల్లాకు చెందిన భానువికాస్, వరంగల్ జిల్లాకు చెందిన సకినాల మానస లవర్స్. ఇంజనీరింగ్ పూర్తిచేసిన అతను ప్రస్తుతం జొమాటో డెలివరీ బాయ్ గా చేస్తున్నాడు. మానస మాత్రం అప్పుడప్పుడూ ఓల్డ్ ఏజ్ హోమ్స్ లో హెల్పర్ గా పనిచేసేది. దర్జాలకు కావాల్సిన డబ్బుల కోసం బైక్ పై తిరుగుతూ.. సిటీ శివారులో కొత్తగా అభివృద్ధి చెందుతోన్న కాలనీల్లో.. నిర్మానుష్యంగా ఉండే ఇళ్లను గుర్తించి దొంగతనాలకు పాల్పడేవాళ్లు.

పెప్పర్ స్ప్రే స్పెషలిస్టులు..
మంచినీళ్లు కావాలనో, ఇల్లు అద్దెకు కావాలనో లోపలికి ప్రవేశించే ఈ జంట.. ఒంటరి మహిళలపై అమాంతం పెప్పర్ స్ప్రేతో దాడి చేసి ఆభరణాలు కాజేసి పారిపోయేవాళ్లు. చోరీ సొత్తును అమ్మగా వచ్చిన డబ్బులతో సిటీలో షాపింగ్స్ గట్రా చేసేవాళ్లు. కొన్నాళ్లుగా పోలీసుల కళ్లుగప్పి తప్పించుకున్నా.. చిన్న పొరపాటుతో దొరికిపోయిందీ జంట.

మలుపుతిప్పిన సంఘటన..
భాను వికాస్, మానసలు 40 రోజుల కిందట.. చెంగిచర్లలోని కనకదుర్గా కాలనీలో అసురెడ్డి బాలమణి అనే మహిళ ఇంట్లో చోరీకి పాల్పడ్డారు.బాధితుల ఫిర్యాదుమేరకు రంగంలోకి దిగిన పోలీసులు.. చుట్టుపక్కల ఏరియాల్లోని సీసీ టీవీ కెమెరాలను పరిశీలించగా.. టీఎస్03 ఈటీ 1326 నంబర్ గల హోండా యాక్టివాపై అనుమానిత జంటను గుర్తించారు. కానీ ఆ బైక్ పోలీసులకు దొరకలేదు.

అడ్డంగా దొరికారిలా..
చెంగిచెర్లలో చోరీ తర్వాత పోలీసుల నిఘా ఉంటుందని ముందే ఊహించిన ప్రేమజంట.. బైక్ ను జాగ్రత్తగా ఇంట్లోనే దాచిపెట్టారు. దాదాపు 40 రోజుల తర్వాత.. నిఘా తగ్గిపోయిందన్న ఉద్దేశంతో మళ్లీ బైక్ పై తిరగడం మొదలుపెట్టారు. రెండ్రోజుల కిందట.. బోడుప్పల్ కమాన్ సిగ్నల్ దగ్గరున్న సీసీటీవీ కెమెరాలో వీళ్ల కదలికలు రికార్డయ్యాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు, సీసీఎస్ టీమ్స్ తో కలిసి దొంగల్ని కనిపెట్టి అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. వారి దగ్గర్నుంచి బైక్ తోపాటు చోరీ చేసిన సొత్తును కూడా స్వాధీనం చేసుకున్నారు.
-
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్‌స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం












Click it and Unblock the Notifications