హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఉక్రెయిన్ సంక్షోభం: మెడికల్ కాలేజీ ఏర్పాటుపై ఆనంద్ మహీంద్ర ప్లాన్, హైదరాబాద్‌కే అవకాశం

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/హైదరాబాద్: రష్యా దాడులతో ఉక్రెయిన్ దేశంలో మెడికల్ విద్యను అభ్యసించేందుకు వెళ్లిన భారతీయులు అర్ధాంతరంగా స్వదేశానికి రావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ పరిస్థితిని నిశితంగా గమనించిన మహీంద్రా అండ్ మహీంద్రా అధినేత ఆనంద్ మహీంద్రా సరికొత్త ఆలోచన చేశారు. తమ యూనివర్సీటీ అధ్వర్యంలో ఓ మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయాలని నిశ్చయించారు. తన ఆలోచనను ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు ఆనంద్ మహీంద్రా.

ఉక్రెయిన్‌పై రష్యా దాడులు.. స్వదేశానికి విద్యార్థులు

ఉక్రెయిన్‌పై రష్యా దాడులు.. స్వదేశానికి విద్యార్థులు

రష్యా భయంకర దాడులతో ఉక్రెయిన్‌లో విపత్కర పరిస్థితులు ఏర్పాడ్డాయి. దీంతో అక్కడ చిక్కుకున్న భారతీయ విద్యార్థులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఆపరేషన్ గంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వేలాది మందిని స్వదేశానికి తీసుకొచ్చింది భారత ప్రభుత్వం. మరికొంత మంది ఇంకా ఉక్రెయిన్ సరిహద్దు దేశాల్లో, ఉక్రెయిన్‌లోనే ఉన్నారు. వారిని కూడా తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే నలుగురు కేంద్రమంత్రులు ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు వెళ్లిన విషయం తెలిసిందే.

మెడికల్ కాలేజీ ఏర్పాటుపై ఆనంద్ మహీంద్ర ఆలోచన

మెడికల్ కాలేజీ ఏర్పాటుపై ఆనంద్ మహీంద్ర ఆలోచన


కాగా, ఉక్రెయిన్‌లో వైద్య విద్యను అభ్యసించేందుకు వెళ్లినవారే కావడం గమనార్హం. మెడిసిన్ కోసం చైనా తర్వాత భారత విద్యార్థులు ఎక్కువగా ఆశ్రయిస్తున్న దేశం ఉక్రెయిన్ అని ఇటీవల పలు జాతీయ మీడియా కథనాలు వెలువడ్డాయి. ఈ క్రమంలో ఓ నివేదికపై ఆనంద్ మహీంద్ర స్పందించారు. భారతదేశంలో మెడిసిన్ కాలేజీల కొరత ఉందనే విషయం నాకు తెలియదు. మహీంద్రా యూనివర్సిటీ క్యాంపస్‌లో మెడికల్ ఇనిస్టిట్యూట్‌ను ఏర్పాటు చేసే ఆలోచనను పరిశీలించొచ్చేమో అని ఆనంద్ మహీంద్ర ట్వీట్ చేశారు.

మహీంద్ర మెడికల్ కాలేజీ... హైదరాబాద్‌కే ఛాన్స్

అంతేగాక, టెక్ మమీంద్రా ఎండీ, సీఈఓ సీపీ గుర్నానీని ట్యాగ్ చేస్తూ ఈ ఆలోచనను పంచుకున్నారు. కాగా, ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. కాగా, మహీంద్రా యూనివర్సిటీ హైదరాబాద్‌లోనే ఉంది. ఒకవేళ ఆనంద్ మహీంద్రా ఆలోచనను ఆచరణలో పెడితే త్వరలోనే హైదరాబాద్‌లో మహీంద్రా మెడికల్ కాలేజీ ఏర్పాటయ్యే అవకాశం ఉందని పలువురు నెటిజన్లు భావిస్తున్నారు.

ఫీజులు అందుబాటులో ఉండాలంటూ ఆనంద్ మహీంద్రకు వినతులు

ఆనంద్ మహీంద్ర ట్వీట్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే, కాలేజీ ఏర్పాటు చేస్తే ఫీజులు కూడా అందుబాటులో ఉండేలా చూడాలని పలువురు నెటిజన్లు ఆనంద్ మహీంద్రను అభ్యర్థించారు. వైద్య విద్య కోసం విదేశాలకు వెళ్లడం వెనుక భారతదేశంలో కాలేజీల కొరత ఒక్కటే కారణం కాదు. ఫీజులు కూడా. చాలా మంది ఖర్చు తక్కువని భావించే విదేశాల్లో మెడిసిన్ చదువుతున్నారని నెటిజన్లు మహీంద్ర దష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో ఆనంద్ మహీంద్ర స్పందిస్తూ.. వీటిని పరిగణలోకి తీసుకుంటానని తెలిపారు.

English summary
Anand Mahindra plans to establish a medical college in Mahindra University.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X