టీ ఎంసెట్లో ఏపీ అమ్మాయి టాప్: 8వ ర్యాంకులో డ్రైవర్ కూతురు(పిక్చర్స్)

హైదరాబాద్: తెలంగాణలో జరిగిన ఎమ్సెట్ -3లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి మానస టాపర్‌గా నిలిచింది. మెడికల్, డెంటల్ కాలేజీల్లో అండర్ గ్రాడ్యుయేట్ సీట్ల భర్తీకి నిర్వహించిన ఎమ్సెట్-3 ఫలితాలను ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టి పాపిరెడ్డి గురువారం మధ్యాహ్నం విడుదల చేశారు.

టాప్-10లో డ్రైవర్ కూతురు

చదువులో ఉన్నతశిఖరాలను అధిరోహించేందుకు కుటుంబ నేపథ్యం, స్థాయితో సంబంధం లేదని మరోసారి నిరూపించిందో అమ్మా యి. తెలంగాణ ఎంసెట్‌-3లో ఓ లారీ డ్రైవర్‌ కూతురు ఏకంగా టాప్‌టెన్‌ లో నిలిచి సత్తా చాటింది. ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని ద్వారకానగర్‌లో నివసిస్తున్న లారీ డ్రైవర్‌ సయ్యద్‌ అక్తర్‌ హుస్సేన్‌కు ముగ్గురు కుమార్తెలు.

చిన్న కుమార్తె నూజ్‌హత ఫాతిమా ఎంసెట్‌-3లో 8వ ర్యాంకును సాధించింది. గతంలో ఆమెకు ఏపీ ఎంసెట్‌లో 68, ఎంసెట్‌-1లో 51, ఎంసెట్‌-2లో 77వ ర్యాంకు దక్కింది. అక్తర్‌ హుస్సేన్‌ పెద్దమ్మాయి బీటెక్‌ పూర్తి చేయగా, రెండో అమ్మాయి బీఎస్సీ ఫైనల్‌ ఇయర్‌ చదువుతోంది. లారీ డ్రైవర్‌గా పనిచేస్తూనే కుమార్తెలను చదివించానని ఆయన మీడియాకు వివరించారు.

టాప్-10 ర్యాంకర్లు:

1. ప్రపుల్ల మానస
2. పి. శ్రీహారిక
3. తేజస్విని
4. అహ్మద్ జలీలి
5. ఇక్రం ఖాన్
6. శ్రీకంఠేశ్వర్ రెడ్డి
7. అలేఖ్య
8. ఫాతిమా
9. కావ్య
10. రూపేష్

 టీ ఎంసెట్లో ఏపీ అమ్మాయి టాప్: 8వ ర్యాంకులో డ్రైవర్ కూతురు(పిక్చర్స్)

టీ ఎంసెట్లో ఏపీ అమ్మాయి టాప్: 8వ ర్యాంకులో డ్రైవర్ కూతురు(పిక్చర్స్)

గుడివాడకు చెందిన రేగెళ్ల ప్రఫుల్ల మానస 160 మార్కులకు 152 మార్కులు సాధించి, అగ్రస్థానంలో నిలిచింది. రెండోస్థానంలో పి శ్రీహారిక (సికింద్రాబాద్), మూడో స్థానంలో తప్పెట తేజస్విని (అనంతపురం) నిలిచింది. జెఎన్‌టియుహెచ్ యుజిసి అకడమిక్ స్ట్ఫా కాలేజీలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో జెఎన్‌టియు విసి ప్రొఫెసర్ ఎ వేణుగోపాల్‌రెడ్డి, కన్వీనర్ డాక్టర్ ఎన్ యాదయ్య, ఇతర సీనియర్ అధికారుల సమక్షంలో మండలి చైర్మన్ ఫలితాల సిడితోపాటు తుది కీని సైతం విడుదల చేశారు.

కుటుంబ సభ్యులతో కావ్య

కుటుంబ సభ్యులతో కావ్య

పరీక్షలో 22 తప్పులు వచ్చాయని విద్యార్ధులు, తల్లిదండ్రులు తమ అభ్యంతరాలు వ్యక్తం చేయగా, ఎమ్సెట్ కమిటీ 8 ప్రశ్నలను తొలగించి అందరికీ 8 మార్కులు కలిపింది. మరో ఐదు ప్రశ్నలకు ఒకటికి మించి కరెక్ట్ సమాధానాలు ఇవ్వడంతో వాటిని కూడా కలిపి మొత్తం 13 ప్రశ్నల విషయంలో పొరపాట్లు జరిగినట్టు ఎమ్సెట్ కమిటీ అంగీకరించింది.

ఎంసెట్ ఫలితాలు విడుదల

ఎంసెట్ ఫలితాలు విడుదల

తొలగించిన 8 ప్రశ్నల్లో ఏడు ప్రశ్నలకు అసలు సరైన సమాధానాలు లేవని, ఒక ప్రశ్న సిలబస్‌లో లేనిది వచ్చిందని చెప్పారు. ఎనిమిది ప్రశ్నల్లో ఒకటి బోటనీ నుండి మూడు ఫిజిక్స్ నుండి నాలుగు కెమిస్ట్రీ నుండి తొలగించామని వివరించారు. అభ్యర్ధులు అందరికీ 8 మార్కులను కలపడంతో ఈసారి ఎమ్సెట్‌లో కేవలం 70 మంది మాత్రమే అనర్హులయ్యారు. ఎమ్సెట్-2లో ఏడో ర్యాంకు సాధించిన తేజస్విని ఎమ్సెట్-3లో మూడో ర్యాంకు సాధించింది.

ఫలితాల జాబితా

ఫలితాల జాబితా

పరీక్షకు 37,180 మంది హాజరుకాగా, అందులో 37,163 మంది అర్హత సాధించారు. 259 క్వాలిఫైయింగ్ పరీక్ష వివరాలు అందలేదని దాంతో వారికి ర్యాంకులను కేటాయించలేదని పేర్కొన్నారు. అర్హత సాధించిన వారిలో 12222 మంది బాలురు కాగా, 24612 మంది బాలికలు ఉన్నారు.

రిజల్ట్ లిస్ట్

రిజల్ట్ లిస్ట్

మైనార్టీ అభ్యర్ధులు 309 మంది అర్హత సాధించారు.
16వ తేదీ ఉదయం 10 గంటలకు అభ్యర్ధుల ఒఎంఆర్ షీట్లను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తామని అభ్యంతరాలు ఉంటే వాటిని కన్వీనర్ దృష్టికి తీసుకురావచ్చని కన్వీనర్ యాదయ్య తెలిపారు. సాధారణ అభ్యర్ధులు 5వేలు, ఇతరులు 2వేలు ఫీజుగా చెల్లించాలని చెప్పారు.
అర్హత సాధించిన వారు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+