తెలంగాణలో 'ఏపీ' పద్మావతిని బలవంతంగా పంపేశారు: దొడ్డదారిలో వచ్చిందా?
హైదరాబాద్: ఏపీ మూలాలు కలిగిన, తెలంగాణ ఫైనాన్స్ సెక్రటరీ నవీన్ మిట్టల్‌కు పర్సనల్ సెక్రటరీగా ఉన్న పద్మావతిని బుధవారం నాడు ప్రభుత్వం బదలీ చేసింది. తెలంగాణ ఉద్యోగుల నుంచి వ్యతిరేకత రావడంతో ఆమెను బదలీ చేశారు.
విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని ఉద్యోగుల విభజన పూర్తిగా కాలేదు. ఉద్యోగుల విభజనలో భాగంగా పద్మావతి తెలంగాణకు కేటాయించబడ్డారు. ఈమె నిన్నటి వరకు నవీన్ మిట్టల్‌కు పర్సనల్ సెక్రటరీగా ఉన్నారు. ఉద్యోగుల వ్యతిరేకత నేపథ్యంలో ఆమెను బదలీ చేశారు.
పదోన్నతుల్లో తమకు నష్టం చేస్తోందంటూ బుధవారం నాడు తెలంగాణ ఉద్యోగులు ఆమె చాంబర్‌కు వెళ్లి ఆమెను బలవంతంగా బయటకు పంపించారు. ఫైళ్లు, పేపర్స్‌ను పడేశారని తెలుస్తోంది. ఆమె కంప్యూటర్‌ను స్విచ్చాఫ్ చేసి, ఆమెను కార్యాలయం నుంచి పంపించేశారు. ఆమెను వెంటనే తప్పించాలని చేయాలని డిమాండ్ చేయడంతో బదలీ చేశారు.

పద్మావతి
రాష్ట్ర ఆర్థిక శాఖలో ఆంధ్రా అధికారిణికి పోస్టింగ్ దక్కడంపై ఉద్యోగుల నుంచి నిరసనలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం ఆమెను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మంగళవారం సచివాలయంలో ప్రారంభమైన ఆందోళనలను ఉద్యోగులు విరమించారు.

పద్మావతి
ఆర్థిక శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్ పీఎస్‌గా పని చేస్తున్న పద్మావతి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని తెలంగాణ ఉద్యోగ సంఘాలు మంగళవారం ఆందోళనకు దిగాయి.

పద్మావతి
సదరు అధికారిణి అడ్డదారిలో తెలంగాణలో పోస్టింగ్ సాధించడంతో పాటు మరోవైపు తెలంగాణ అధికారులను కాదని అక్రమంగా పదోన్నతి పొందడానికి ప్రయత్నిస్తున్నారంటూ తెలంగాణ ఉద్యోగ సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. ఆమెను తొలుత ఏపీకి పంపించారని చెప్పారు. కానీ తెలంగాణకు నిబంధనలకు విరుద్ధంగా వచ్చారన్నారు.

పద్మావతి
ఈ క్రమంలో తెలంగాణ సచివాలయ సంఘం నాయకులు నేతి మంగమ్మ, యూసఫ్, రాజేశ్వర్ రెడ్డి, శ్యాంసుందర్, జ్యోతి ఆధ్వర్యంలో ఉద్యోగులు బుధవారం మధ్యాహ్నం సచివాలయంలోని ఆర్థికశాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్ కార్యాలయానికి చేరుకుని ఆందోళనకు దిగారు.

పద్మావతి
ఆంధ్ర అధికారులు, ఉద్యోగుల కొమ్ముకాసే వారిని సహించేది లేదని హెచ్చరించారు. ఘటన అనంతరం మూడు గంటల్లోనే పద్మావతిని బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

పద్మావతి
ఆర్థిక శాఖ కార్యదర్శి ప్రయివేటు కార్యదర్శి పదవి నుంచి ఆమెను తప్పించి అదే శాఖలో ప్రభుత్వ ఆర్థిక సలహాదారు జీఆర్ రెడ్డి పీఎస్‌గా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ప్రభుత్వ నిర్ణయంపై తెలంగాణ సచివాలయ సంఘం నాయకులు మంగమ్మ, యూసఫ్, రాజేశ్వర్ రెడ్డి హర్షం ప్రకటించారు.












Click it and Unblock the Notifications