ఖమ్మం జిల్లా అంగన్వాడీ స్కూల్ లో దారుణం.. చిన్నారి అని కూడా చూడకుండా !
ఖమ్మం జిల్లా గోపాలపురంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న అంగన్వాడి స్కూల్ లో పాపను ఆయా విచక్షణ రహితంగా కొట్టడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆ దెబ్బలకు తట్టుకోలేక చిన్నారి వీపుపై వాతలు రావడమే కాకుండా జ్వరంతో అనారోగ్యం బారిన పడడంతో ఘటన వెలుగు లోకి వచ్చింది. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న చిన్నారి కుటుంబ సభ్యులు సంబంధిత ఆయాపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఈ దారుణ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గోపాలపురంలో నివసిస్తున్న బండ్ల వెంకటనారాయణ.. తన మనవరాలిని అంగన్వాడీ సెంటర్ 1 నందు చదుకునేందుకు పంపించారు. అయితే అక్కడ ఆయాగా పని చేస్తున్న ఖాసింబీ విచక్షణ రహితంగా పసి పాప అని కూడా చూడకుండా పచ్చిబరెకతో కొట్టింది. దీంతో చిన్నారికి ఒళ్లంతా వాతలు పడి జర్వం తగిలందని కుటుంబ సభ్యులు వాపోతున్నారు.

తన మనవరాలిని కొట్టిన ఆయా సెంటర్ టీచర్ లను తక్షణమే తొలగించాలని లేదంటే సెంటర్ లో చదువుకోవడానికి పిల్లలు రావడానికి భయపడతారని వెంకటనారాయణ అన్నారు. అసలు అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలను దండించి బెత్తంతో కొట్టె హక్కు ఎవరిచ్చారని ప్రశ్నిస్తున్నారు. సంబంధిత శాఖ అధికారులు వీరిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని లేదంటే అంగన్వాడీ సెంటర్ ఎదుట ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసానికి కూతవేటు దూరంలో ఉన్న అంగన్వాడీ సెంటర్లోనే పరిస్థితి ఇలా ఉంటే.. జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల్లో పరిస్థితి ఎలా ఉందో అర్ధమవుతుందని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలపై దృష్టి సారించాలని కోరారు.












Click it and Unblock the Notifications