జూబ్లీహిల్స్ లో అంజన్ బిగ్ ట్విస్ట్, రేవంత్ వాట్ నెక్స్ట్..!!
జూబ్లీహిల్స్ బై పోల్ వేళ కాంగ్రెస్ లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. జూబ్లీహిల్స్ సీటు ఆశించిన మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు. సీటు ఖరారు వేళ తనతో సంప్రదించకపోవటం పైన అంజన్ అలక బూనారు. తన మద్దతు దారులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. నాలుక దశాబ్దాలుగా పార్టీలో ఉన్న తనకు కనీస గౌరవం ఇవ్వలేదని వాపోయారు. రెబల్ అభ్యర్దిగా బరిలోకి దిగాలని అంజన్ పైన ఒత్తిడి పెరుగుతోంది. దీంతో.. అంజన్ నిర్ణయం పైన ఉత్కంఠ పెరుగుతోంది.
జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్దిగా పార్టీ నాయకత్వం నవీన్ యాదవ్ ను ప్రకటించింది. ఈ సీటు కోసం మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ సైతం పోటీ పడ్డారు. పార్టీ అధినాయకత్వం నవీన్ యాదవ్ కు సీటు కేటాయించటంతో ఇప్పుడు అంజన్ తన మద్దతు దారులతో సమావేశం అయ్యారు. పార్టీ అభ్యర్ధి ఖరారు వేళ తనతో కనీసం సంప్రదించలేదని వాపోయారు. అంజన్ కుమారుడు ఎంపీగా ఉండటంతో... జూబ్లీహిల్స్ సీటు విషయంలో హైకమాండ్ పక్కన పెట్టింది. ఇప్పటికే అభ్యర్ధిని ఖరారు చేసినా.. అంజన్ తన పట్టు వీడటం లేదు. అంజన్ రెబల్ అభ్యర్దిగా పోటీ చేయాలని ఆయన మద్దతు దారులు ఒత్తిడి చేస్తున్నారు. దీంతో.. అంజన్ ను బుజ్జగించేందుకు మంత్రులు రంగంలోకి దిగారు.

జూబ్లీహిల్స్ పర్యవేక్షిస్తున్న మంత్రి వివేక్ నేరుగా అంజన్ నివాసానికి వెళ్లారు. అంజన్ కు శాలువా కప్పేందుకు ప్రయత్నించగా తొలుత నిరాకరించారు. ఆ తరువాత ఇద్దరి మధ్య చర్చలు జరిగాయి. పార్టీ నిర్ణయం మేరకు నవీన్ యాదవ్ ను గెలిపించుకోవాలని మంత్రి కోరారు. తాను 40 ఏళ్లుగా కాంగ్రెస్ లో ఉన్నానని.. రెండు సార్లు ఎంపీగా పని చేసిన తనను కనీసం పట్టించుకోకపోవటం పైన అంజన్ అసహనం వ్యక్తం చేసారు. తనకు విలువ లేదా అంటూ ప్రశ్నించినట్లు సమాచారం. దీంతో, సీటు ఖరారు కావటంతో పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని వివేక్ కోరారు. తన మద్దతు దారులతో చర్చించిన తరువాత తన నిర్ణయం చెబుతానని అంజన్ స్పష్టం చేసినట్లు సమాచారం. కాగా.. ఇప్పుడు అంజన్ ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తారు.. సీఎం రేవంత్ ఏం చేయబోతున్నారనేది కీలకంగా మారుతోంది.












Click it and Unblock the Notifications