శ్రీశైలం విద్యుత్ కేంద్రంలో మళ్లీ ప్రమాదం - పరుగులు తీసిన ఉద్యోగులు - విద్యుత్ సరఫరా ఆపడంతో..

తెలంగాణ పరిధిలోని శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్ కేంద్రంలో మరోసారి ప్రమాదం చోటుచేసుకుంది. ఇటీవల జరిగిన భారీ ప్రమాదంతో ఈ కేంద్రంలో పునరుద్ధరణ పనులు జరుగుతుండగా.. బుధవారం అనూహ్య ఘటన సంభవించింది.

విద్యుత్ కేంద్రంలోకి సామాగ్రిని తీసుకెళుతోన్న ఓ లారీ.. పక్కనే ఉన్న విద్యుత్ కేబుళ్లపై దూసుకెళ్లగా.. పెద్ద శబ్దాలతో మంటలు చెలరేగాయి. ఆ దృశ్యాలు చూసి అక్కడున్న సిబ్బంది భయంతో పరుగులు తీశారు. కొద్ది నిమిషాలపాటు ఒక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

 another accident at srisailam left bank power station on wednesday

విద్యుత్ కేబుళ్లపైకి లారీ దూసుకొచ్చి, మంటలు చలరేగిన వెంటనే అప్రమత్తమైన అధికారులు.. విద్యుత్ సరఫరాను నిలిపేశారు. సకాలంలో ఆ పని చేసి ఉండటం వల్ల పెను ప్రమాదం తప్పినట్లయింది. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు తాజా ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు.

పది రోజుల కిందట ఇదే ఎడమగట్టు విద్యుత్ కేంద్రంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా తలెత్తిన భారీ ప్రమాదంలో 9 మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోవడం తెలిసిందే. దేశవ్యాప్తంగానూ చర్చనీయాంశమైన ఆ సంఘటనను సీరియస్ గా తీసుకున్న తెలంగాణా సర్కార్.. సిఐడి విచారణకు ఆదేశించింది. గత ప్రమాదం తాలూకు నష్టాన్ని పునరుద్ధరిస్తున్న క్రమంలోనే తాజా ప్రమాదం చోటుచేసుకుంది.

శ్రీశైలం రిజర్వాయర్ వద్ద మంగళవారం రాత్రి కూడా మరో ఘటన జరిగింది. డ్యాం ప్రవేశ ద్వారం వద్ద కొండ చరియలు విరిగిగిపడి, బండరాళ్లు రోడ్డపైకి వచ్చిపడ్డాయి. ఆ మార్గంలోనే ఉద్యోగులు, పర్యాటకులు నిరంతరం రాకపోకలు కొనసాగిస్తారు. కాగా, కొండచరియలు విరిగిపడిన రాత్రి సమయంలో అక్కడెవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పినట్లయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+