టెక్కీ సునీత ఆత్మహత్యలో మరో కోణం: కట్నం కావాలన్న ప్రియుడు..

రూ.6లక్షలు కట్నం ఇస్తేనే పెళ్లి చేసుకుంటానని ప్రియుడు తేల్చి చెప్పడంతో.. అంత డబ్బు ఇవ్వలేక సునీతకు ఆత్మహత్యకు పాల్పడినట్లు చెబుతున్నారు.

హైదరాబాద్: నగరంలో కలకలం రేపిన టెక్కీ సునీత ఆత్మహత్య కేసులో మరో కోణం వెలుగుచూసింది. ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు తేలింది. రూ.6లక్షలు కట్నం ఇస్తేనే పెళ్లి చేసుకుంటానని ప్రియుడు తేల్చి చెప్పడంతో.. అంత డబ్బు ఇవ్వలేక సునీతకు ఆత్మహత్యకు పాల్పడినట్లు చెబుతున్నారు.

కాగా, అమీర్ పేటలోని ఓ ప్రైవేటు సంస్థలో టెలీకాలర్ గా పనిచేస్తున్న సునీత ఈ నెల 15న హైటెక్ సిటీ ప్రాంతంలో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. బన్సీలాల్ పేటలోని తన అన్న ఇంట్లో ఉంటున్న సునీత.. ఆరేళ్ల క్రితం తనతో పాటు చేసిన శ్రవణ్ అనే వ్యక్తితో ప్రేమలో పడింది.

Another angle in techie sunithas suicide case

కొన్నాళ్ల పాటు సునీతతో బాగానే ఉన్న శ్రవణ్.. పెళ్లి మాటేత్తసరికి ఆమెను దూరం పెట్టడం మొదలుపెట్టాడు. మరోవైపు తనను పెళ్లి చేసుకోవాల్సిందిగా సునీత అతనిపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చింది. ఇదే క్రమంలో ఫిబ్రవరి 14వ తేదీన తనను కలవాలని, లేనిపక్షంలో ఆత్మహత్య చేసుకుంటానని అతనితో చెప్పింది.

అదే రోజు పెట్రోలును సైతం కొనుగోలు చేసి భాగ్యనగర్ సొసైటీ పొదల్లో దాచిపెట్టింది. మరుసటి రోజు ప్రియుడు తనను కలవడానికి రాకపోవడంతో తీవ్రమనస్థాపం చెంది ఆత్మహత్యకు పాల్పడింది. కాగా, కూకట్ పల్లికి చెందిన శ్రవణ్ ఇప్పటికే ఐదుగురు అమ్మాయిలను మోసం చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం అతను పోలీసుల అదుపులోనే ఉన్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+