గువ్వల బాలరాజుపై మరోసారి దాడి

హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే, అచ్చంపేట అభ్యర్థి గువ్వల బాలరాజుపై మరోసారి దాడి జరిగింది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఉండగా గువ్వల బాలరాజుపై మతిస్థిమితంలేని వ్యక్తి మట్టిపెళ్లతో దాడి చేశాడు. అమ్రాబాద్ మండలంలోని కుమొరోనిపల్లిలో సోమవారం రాత్రి ఈ ఘటన జరిగింది. వెంటనే అప్రమత్తమైన కార్యకర్తలు దాడి చేసిన వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

నిందితుడిని పర్వతాలుగా పోలీసులు గుర్తించారు. పర్వతాలుకు మతిస్థిమితం లేదని.. తరచూ కుటుంబసభ్యులు, గ్రామస్థులపై ఇలాగే దాడులు చేస్తుంటాడని స్థానికులు చెబుతున్నట్లు ఎస్సై వీరబాబు తెలిపారు. కాగా, బాలరాజుపై ఇది రెండో దాడి కావడం గమనార్హం.

 Another attack on BRS MLA candidate guvvala balaraju

గత శనివారం రాత్రి అచ్చంపేటలో జరిగిన ఘర్షణలో ఎమ్మెల్యే బాలరాజు స్వల్పంగా గాయపడిన విషయం తెలిసిందే. దీంతో అచ్చంపేటలో ప్రాథమిక చికిత్స అనంతరం హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చేరారు. ఆదివారం డిశ్చార్జి అయిన ఆయన.. ఇవాళ ప్రచారం చేస్తుండగా మరోసారి దాడి జరగడం గమనార్హం.

మొదటి దాడి జరిగిన అనంతరం గువ్వల బాలరాజు ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. తనపై దాడి జరుగుతుందన్న సమాచారంతో పది రోజుల ముందే పోలీసులకు సమాచారం ఇచ్చానని చెప్పారు. ఈ విషయమై నాగర్ కర్నూల్ ఎస్పీకి ఫిర్యాదు చేశానన్నారు. తాను ప్రజల గుండెల్లో నిలిచిపోయానని, ప్రజల ఆశీర్వాదంతో గెలిచి తీరుతానని చెప్పారు. దేవుడి దయ, ప్రజల ఆశీస్సుల వల్ల ప్రాణాలతో బయట పడ్డానని గువ్వల బాలరాజు చెప్పారు.

'నా కాన్వాయ్‪ను వెంబడించి దాడి చేశారు అని గువ్వల బాలరాజు ఆరోపించారు. 'కాంగ్రెస్ గూండాలు నాపై దాడి చేశారు. నా అనుచరులకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి అని బాలరాజు చెప్పారు. డబ్బుతో రాజకీయం చేయొచ్చని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీకి బుద్ది చెబుతామని బాలరాజు హెచ్చరించారు. నన్ను, కార్యకర్తలను చంపాలని చూశారు. క్యాడర్, కార్యకర్తల మధ్య కొట్లాట పెట్టడం తగదు అని అన్నారు. 'జైళ్ల నుంచి క్రిమినల్స్‌ను తీసుకొచ్చి దాడులకు దిగుతున్నారని, పగలు, ప్రతీకారాలు మా సంస్కృతి కాదని కూలీ పని చేసుకునే తన తల్లిదండ్రులు భయ పడుతున్నారని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+