కేసీఆర్ కు మరో బిగ్ షాక్..అదే జరిగితే గ్రేటర్ లో బీఆర్ఎస్ ఖల్లాస్!

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓటమి బిఆర్ఎస్ పార్టీకి భారీ షాకిచ్చింది. అయితే త్వరలో మరో భారీ షాక్ బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ చూడబోతున్నారు అని పార్టీ శ్రేణులలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఓటమితో బి ఆర్ ఎస్ పార్టీ శ్రేణులలో నైరాశ్యం ఆవహించింది.

కేసీఆర్, కేటీఆర్ రాజకీయాలపై పార్టీ శ్రేణుల్లో చర్చ
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్ కి మాత్రమే పరిమితం కావడం, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బాధ్యత కేటీఆర్ భుజాల మీద వేసుకున్నప్పటికీ అక్కడ బిఆర్ఎస్ ఓటమిపాలు కావడం పార్టీ శ్రేణులలో చర్చనీయాంశంగా మారింది. కెసిఆర్ ఇకపై పార్టీని పట్టించుకుంటారా లేదా అన్నది పార్టీ ముఖ్య నేతలలో జరుగుతున్న చర్చ. మరోవైపు కేటీఆర్ నాయకత్వంలో ఉపఎన్నికలో ఓడిపోవడం కేటీఆర్ ను ఒక ఫెయిల్యూర్ లీడర్ గా నిలబెట్టింది.

Another big shock for KCR 10 BRS MLAs in touch with Congress

Take a Poll

కారు దిగనున్న మరో పదిమంది ఎమ్మెల్యేలు
ఈ క్రమంలో కేటీఆర్ ని నమ్ముకుంటే రాజకీయాలలో నట్టేట మునుగుతామా అన్న చర్చ పార్టీలో జోరుగా సాగుతుంది. ఇప్పటికే పదిమంది గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ కు షాకిచ్చి కాంగ్రెస్ గూటికి చేరిన విషయం తెలిసిందే. అయితే తాజా రాజకీయ పరిణామాలతో మరో పదిమంది గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లు సమాచారం. ఈ నేతలు ఎప్పటినుంచో ఢిల్లీ పెద్దలతో టచ్లో ఉన్నట్టుగా ప్రస్తుతం రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.

జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక తర్వాత పార్టీ మారే ఆలోచనలో గులాబీ ఎమ్మెల్యేలు
గత కొంతకాలంగా ఈ నేతలు రాష్ట్రంలో రాజకీయ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలలో కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకత పెరుగుతుంది అని భావిస్తున్న క్రమంలో మళ్లీ కాంగ్రెస్ పార్టీలోకి వెళితే భవిష్యత్తులో ఇబ్బంది పడతామేమో అన్న ఆలోచనతో పార్టీ మారకుండా ఆగిపోయిన నేతలు, తాజాగా జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఇచ్చిన తీర్పుతో ప్రజాక్షేత్రంలో బిఆర్ఎస్ పార్టీకి ఆదరణ లేదన్న విషయాన్ని గుర్తించి పార్టీ మారాలని ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.

గ్రేటర్ హైదరాబాద్ లోనే గులాబీ పార్టీకి పెద్ద దెబ్బ
ఈ క్రమంలోనే జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితం తర్వాత పలువురు అధికార పార్టీకి పార్టీ మారే తమ ఆలోచనకు సంబంధించి సంకేతాలు పంపుతున్నట్టు కాంగ్రెస్ వర్గాలలో ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సుమారు పదిమంది గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు రెడీగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇదే గనుక జరిగితే గులాబీ అధినేత కేసిఆర్ కు కోలుకోలేని దెబ్బ తగులుతుంది అన్నది మాత్రం ఖాయంగా కనిపిస్తుంది.

చేరికలపై కాంగ్రెస్ అధిష్టానం ఆలోచన
అయితే ప్రస్తుత పరిస్థితులలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవడం వల్ల తలెత్తే న్యాయపరమైన, రాజకీయపరమైన అంశాలపైన కాంగ్రెస్ అధిష్టానం ఆరా తీస్తున్నట్లు గా తెలుస్తోంది. ఇక నిన్న ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలను సీఎం రేవంత్ రెడ్డి, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన నవీన్ యాదవ్ కలిశారు. ఈ సమయంలో కూడా బీఆర్ఎస్ పార్టీ నుండి పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేందుకు సుముఖంగా ఉన్నారన్న విషయం పైన చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఏదేమైనా అదే గనుక జరిగితే కెసిఆర్ పార్టీకి భయంకరమైన దెబ్బ తగిలినట్టే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+