ఎంపీ ధర్మపురి అరవింద్‌పై మరో కేసు: ఇంటికెళ్లి బీజేపీ నేత బొడిగ శోభను అరెస్ట్ చేసిన పోలీసులు
హైదరాబాద్/కరీంనగర్: నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌పై మరో కేసు నమోదైంది. డీజీపీ, పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని బంజారాహిల్స్ పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. డీజీపీ, ఐపీఎస్ అధికారులను తీవ్ర పదజాలంతో దూషించారని పలు సెక్షన్ల కింద అరవింద్‌పై కేసు పెట్టారు.

ధర్మపురి అరవింద్‌పై బంజారాహిల్స్ పీఎస్‌లో కేసు
ఐపీసీ 294, 504, 505 1(1), (బి) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. విచారణ కోసం ఇప్పటికే నిజామాబాద్ వెళ్లిన పోలీసులు. గత నవంబర్ నెల 8న ప్రెస్‌మీట్‌లో సీఎంపై అరవింద్ అనుచిత వ్యాఖ్యలు చేశారని బోయినిపల్లికి చెందిన వ్యాపారి కళ్యాణ్ సందీప్ రెండు రోజుల కిందట బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.

సీఎం కేసీఆర్‌పై అసభ్యకర పోస్టులు: అరవింద్‌పై 3 కేసులు
అంతేగాక, కేసీఆర్‌పై అసభ్యకర పోస్టులు, వీడియోలను అరవింద్ సామాజిక మాధ్యమాల్లో పెట్టినట్లు 2021 డిసెంబర్ 29న టీఆర్ఎస్ సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్ సతీష్ రెడ్డి గుర్తించి, వనస్థలిపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అక్కడి పోలీసులు కేసును బంజారాహిల్స్ పీఎస్‌కు బదిలీ చేశారు. ఈ రెండు కేసులతోపాటు తాజాగా బుధవారం అరవింద్‌పై మరో కేసు నమోదు చేశారు. మొత్తం మూడు, నాలుగు కేసులు నమోదైనట్లు తెలుస్తోంది.

బీజేపీ నేత బొడిగె శోభ అరెస్ట్
ఇది ఇలావుండగా, కరీంనగర్‌లో మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత బొడిగె శోభను పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం ఉదయం శోభ ఇంటి వద్దకు వచ్చిన పోలీసులు.. ఆమెను అదుపులోకి తీసుకున్నారు. శోభ ఇంటికి వచ్చిన పోలీసులు తలుపులు కొట్టి మరి ఆమెను తీసుకెళ్లారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ జనజాగరణ దీక్షలో పాల్గొన్న కారణంగా ఆమెను అరెస్టు చేశారు.

కేసీఆర్ సర్కారుకు బొడిగె శోభ వార్నింగ్
ఈ సందర్భంగా శోభ మాట్లాడుతూ.. ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ఉద్యమ కారులతో పెట్టుకోవద్దని హెచ్చరించారు. ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల పక్షాన పోరాడతామన్నారు. ప్రభుత్వ కేసులకు భయపడే ప్రసక్తే లేదన్నారు బొడిగె శోభ. బీజేపీ జాగరణ దీక్షలో భాగంగా శోభపై కేసు నమోదు చేశారు పోలీసులు. శోభ అరెస్ట్‌పై ఆమె భర్త స్పందించారు. తప్పుడు సెక్షన్లు పెట్టి పోలీసులు కేసులు నమోదు చేశారని ఆరోపించారు.
333 చట్టం ప్రకారం నాన్ బెయిలబుల్ కేసు పెట్టారని మండిపడ్డారు. పోలీసులపై బీజేపీ నేతలు ఎక్కడ దాడి చేశారని ప్రశ్నించారు. ఈ అరెస్టులకు కారణం కేటీఆర్ అన్నారు శోభ భర్త. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తోపాటు పలువురు నేతలు జైలులో ఉన్న విషయం తెలిసిందే.
-
సామాన్యులకు బిగ్ షాక్..! పెరగనున్న ధరలు.. దేశంలోనే తెలంగాణ టాప్..! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
అలా చేస్తే శాశ్వతంగా నష్టపోతాం -
రాష్ట్రంలో భారీగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. -
కవిత ఆశల పై కేటీఆర్ నీళ్లు, సెంటిమెంట్ అస్త్రం..!! -
SRH vs RR: ట్రాక్ రికార్డ్ వర్సెస్ ఫామ్-ఆ ఒక్కడే గేమ్ ఛేంజర్ ..! -
Praful Hinge: తొలి మ్యాచ్, తొలి ఓవర్లోనే అద్భుతం-చరిత్ర సృష్టించిన హైదరాబాద్ కొత్త బౌలర్..! -
Health Insurance: తక్కువ ప్రీమియం.. పెద్ద మోసం! -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ???












Click it and Unblock the Notifications