తెలంగాణాకు ముంచుకొస్తున్న మరో ప్రమాదం.. ఐఎండీ హెచ్చరిక!

తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ ప్రమాదం పొంచి ఉంది. ఈనెల 5వ తేదీన బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. దీని ప్రభావం తెలుగు రాష్ట్రాల పైన ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు. దీని ప్రభావంతో తెలంగాణా రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.

త్వరలో మరో తుఫాన్.. తెలంగాణాకు తీవ్ర హెచ్చరిక
ఉత్తర అండమాన్ సమీపంలో ఏర్పడనున్న ఈ అల్పపీడనం క్రమంగా తుఫాన్ గా మారే అవకాశం ఉందని ఈ తుఫాను ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిస్సా తీరం దాటుతుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఒక వాయుగుండం సృష్టించిన విలియం మరవకముందే మరో తుఫాను గండం ముంచుకొస్తున్న క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

Another dangerous cyclone effect on Telangana heavy rains soon IMD warning

తెలంగాణాలో వరదల ఎఫెక్ట్
ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో వరద విలయ వితాండవం చేస్తుంది. ఊహించని విధంగా రాష్ట్రంలోని అనేక జిల్లాలు ముంపునకు గురయ్యాయి. ఖమ్మం, ఆదిలాబాద్, సూర్యాపేట, నల్గొండ తదితర జిల్లాలలోని అనేక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. దీంతో బాధితులను పునరావస కేంద్రాలకు తరలించి వారికి కావాల్సిన మౌలిక వసతులు కల్పిస్తున్నారు అధికారులు.

సీఎం రేవంత్ రెడ్డి అలెర్ట్
ఇక ఇదే సమయంలో మళ్లీ గురువారం నాడు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే తుఫానుగా మారుతుందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం అలర్ట్ అయింది. వాతావరణ శాఖ హెచ్చరికలతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను అప్రమత్తం చేశారు. వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసిన జిల్లాల పైన ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్లకు సూచనలు చేశారు.

అధికారులకు సీఎం ఆదేశాలు
ముందస్తు జాగ్రత్తలు తీసుకొని నష్ట తీవ్రతను తగ్గించే ప్రయత్నం చేయాలన్నారు. ప్రాణ నష్టం జరగకుండా జాగ్రత్త పడాలని సూచించారు. అధికారులు ఎవరూ సెలవులు పెట్టొద్దని, ప్రజలకు సేవలు అందించడం మీదే అందరి ఫోకస్ ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇక వరద సహాయక చర్యల పైన వరదల పరిస్థితి పైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కూడా జిల్లా కలెక్టర్లు అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ఎప్పటికప్పుడు తగు సూచనలు చేస్తున్నారు.

మళ్ళీ భారీ వర్షాలకు చాన్స్
ఐ ఎం డి హెచ్చరికల నేపథ్యంలో అధికారులను ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని మరో రెండు మూడు రోజుల్లో మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న కారణంగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇదిలా ఉంటే నేడు కూడా తెలంగాణ రాష్ట్రంలో అనేక జిల్లాలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

ఈ జిల్లాలలో నేడు వర్షాలు
ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, జగిత్యాల జిల్లాలతో పాటు మల్కాజ్గిరి, సిద్దిపేట జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 11 జిల్లాల్లో మోస్తరు కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండి తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+