మొన్న చెల్లి.. నేడు అక్క: ‘నిర్లక్ష్యపు గొయ్యి’ ఘటనలో సుమలత మృతి

Subscribe to Oneindia Telugu

వరంగల్‌: హన్మకొండలోని కేయూ-పెద్దమ్మగడ్డ రోడ్డు అభివృద్ధి పనుల్లో భాగంగా తవ్విన గుంతతో పాటు అధికారులు, గుత్తేదారుల నిర్లక్ష్యం కారణంగా మార్చి 9న జరిగిన ప్రమాదంలో డిగ్రీ విద్యార్థిని సండ్ర మౌనిక మృతిచెందగా ఆ ఘటనలో తీవ్రంగా గాయపడిన మౌనిక అక్క సుమలత (22) హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ బుధవారం మృతిచెందింది.

హసన్‌పర్తి మండలం పెగడపల్లి గ్రామానికి చెందిన సండ్ర పోశయ్య, ఉపేంద్ర దంపతులకు ముగ్గురు కూతుర్లు, ఒక కుమారుడు ఉన్నారు. భర్త పోశయ్య గతంలోనే మృతిచెందగా ఉపేంద్ర కుటుంబానికి అండగా నిలిచి పెద్ద కుమారైకు వివాహం చేసింది. కుమారుడు, ఇద్దరు కూతుర్లను ప్రయోజకులకు చేయాలనే ఉద్దేశంతో తాను కష్టపడి వారిని ఉన్నత చదువులు చదివిచింది.

Another girl allegedly killed in a road accident

కుమారుడు ఉద్యోగం చేస్తుండగా.. ఇద్దరు కూతుర్లలో చిన్నమ్మాయి. మౌనిక హన్మకొండ సుబేదారిలోని ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలలో డిగ్రీ, పెద్దమ్మాయి సుమలత హసన్‌పర్తిలోని వినూత్న కళాశాలలో బీటెక్‌ పూర్తి చేసినట్లు బంధువులు చెప్పారు. భర్త తోడు లేకున్నా పిల్లలను విద్యావంతులుగా తీర్చిదిద్దిన ఆమెకు మొన్నటివరకు పిల్లలు అండగా నిలిచారు. కొడుకు, కూతుళ్లతో సందడిగా ఉండే ఆ ఇల్లు ప్రస్తుతం బోసిపోయింది.

మార్చి 9న జరిగిన రోడ్డు ప్రమాదంలో చిన్న కూతురు ఘటనా స్థలంలోనే దుర్మరణం చెందగా పెద్ద కూతురు గాయాలతో బయటపడింది. ఆమె కోలుకుంటుందని.. ఇంటికి తిరిగివస్తుందని ఎదురుచూసిన కుటుంబ సభ్యులను దుఖఃసముద్రంలో ముందు సుమలత చికిత్స పొందుతూ కన్నుమూసింది. చెల్లెలు మౌనిక చనిపోయిన 13 రోజులకే అక్క మృతిచెందడంతో పెగడపల్లిలో విషాదం అలముకొంది.

అధికారులు, గుత్తేదారు నిర్లక్ష్యం పుణ్యమాని ఒకే ఇంట్లోని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృత్యువాతపడ్డారు. ఆరోజు ద్విచక్ర వాహనం నడిపిన రాజు అనే యువకుడు ఆస్పత్రిలో ఇంకా చికిత్స పొందుతున్నాడు. సుమలత అంత్యక్రియలను పెగడపల్లిలో గురువారం నిర్వహించనున్నట్లు బంధువులు తెలిపారు.

దంతాలపల్లి నుంచే లీకులు: వీడిన టెన్త్‌ ఇంగ్లిష్‌ పేపర్‌ మిస్టరీ

ఖమ్మం: ఖమ్మం నగరంలో మంగళవారం పదో తరగతి ఇంగ్లీష్‌ పేపర్‌-1 లీక్‌ చేసిన వ్యవహారంలో ఆరుగురిని పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఇందులో ముగ్గురు ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు కూడా ఉన్నారు. ఖమ్మం అర్బన్‌ ఏసీపీ పి.వి.గణేష్‌ బుధవారం రాత్రి మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.

పదో తరగతి పేపర్‌ లీక్‌ విషయాన్ని ప్రభుత్వం సీరియస్‌గా పరిగణించింది. దీంతో ఏసీపీ గణేష్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక పోలీస్‌ బృందాలు రంగంలోకి దిగి 24 గంటల్లో పేపర్‌ లీక్‌కు కారకులైన ఆరుగురిని అరెస్టు చేశారు. తొలుత ఇంగ్లీష్‌ ప్రశ్నాపత్రాన్ని పలువురికి షేర్‌చేసిన గండెమెడ రామలింగస్వామి అనే ఉపాధ్యాయుడిని ఖమ్మంలో మంగళవారం సాయంత్రం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇతను ఖమ్మంలోని మమత ఆసుపత్రి రోడ్‌లోని ఒక ప్రైవట్ పాఠశాలలో మాథ్స్‌ లెక్చరర్‌గా పని చేస్తున్నాడు.

స్వామి ద్వారా పోలీసులు కూలీలాగారు. పరీక్షా పత్రాన్ని వరంగల్‌ రూరల్‌ జిల్లా వర్ధన్నపేటలోని ఒక ప్రైవ్‌ే పాఠశాలకు చెందిన కమ్మగాని రాజ్‌కుమార్‌ అలియాస్‌ మెస్‌రాజు, పాఠశాల హెచ్‌ఎం నాగరవి ప్రసాద్‌ సమాధానాల కోసం స్వామికి షేర్‌ చేశారని గుర్తించిన పోలీసులు వారిద్దరిని మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు.

అనంతరం వారికి ఆ పేపర్‌ ఎక్కడి నుంచి వచ్చిందనే విషయంపై విచారించడంతో మహబూబ్‌బాబాద్‌ జిల్లా దంతాలపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ జెడ్పీ ఉన్నత పాఠశాల నుంచి వచ్చిందని నిర్ధారించుకున్నారు. దంతాలపల్లి ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ప్రభుత్వ ఉపాధ్యాయులు కస్తూరి సతీష్‌, యెల్లు హర్షవర్ధన్‌రెడ్డి, అక్కిరెడ్డి వెంక్‌రెడ్డి ఇంగ్లీష్‌ పేపర్‌ను వర్ధన్పపేట ప్రైవేటు పాఠశాలకు చెందిన మెస్‌ రాజు, నారవి ప్రసాద్‌కు వాట్సప్‌ ద్వారా పంపించారని గుర్తించి వారిని అరెస్టు చేశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Another girl allegedly killed in a road accident in Hanamkonda in Warangal district.
Please Wait while comments are loading...