మల్లారెడ్డి, అల్లుడు రాజశేఖర్ రెడ్డిపై భూ కబ్జా కేసు
మాజీ మంత్రి, మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి మరో ఎదురుదెబ్బ తగిలింది. మల్లారెడ్డిపై పేట్‌బషీర్‌బాద్ పోలీసులు భూకబ్జా కేసు నమోదు చేశారు. మల్లార్ రెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డిపై మొత్తం ఏడు సెక్షన్లతో కేసు నమోదు చేసినట్లు తెలిసింది. పేట్ బషీర్ బాద్ లో 32 గుంటల భూమి ఆక్రమణకు గురై నిర్మాణాలు కూల్చివేసినట్లు శేరి శ్రీనివాస్ రెడ్డి అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి పేట్‌బషీర్ బాద్ పోలీసులను ఆశ్రయించాడు.
శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు పోలీసులు మల్లారెడ్డిపై కేసు నమోదు చేశారు.
తాజాగా మల్లార్ రెడ్డి, అల్లుడు రాజశేఖర్ రెడ్డి జోక్యంతో సుచిత్రలో వివాదం చోటుచేసుకుంది. ఈ కేసులో మల్లారెడ్డిని అరెస్ట్ చేసి జైలుకు తరలించిన విషయం తెలిసిందే. హైదరాబాద్ నగర శివారులోని కుత్బుల్లాపూర్ మండలం జీడిమెట్ల గ్రామంలోని సుచిత్ర పరిధిలోని సర్వేనెంబర్ 82, 83లో మాజీ మంత్రి మల్లారెడ్డి, ఇతరుల మధ్య భూ వివాదం నడుస్తోంది.

అయితే మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి మాత్రం రెండున్నర ఎకరాల భూమి తమదేనని వాదిస్తున్నారు. 1.11 ఎకరాల భూమి తమదని మరో 15 మంది చెబుతున్నారు. సర్వే నెం.82లోని స్థలంలో మల్లారెడ్డి, ఆయన అల్లుడు, మరో 15 మంది మధ్య వాగ్వాదం జరిగింది. ఒక్కొక్కరు 400 గజాల చొప్పున గతంలో భూమి కొనుగోలు చేశారని 15 మంది చెబుతున్నారు. అంతేగాక, కోర్టు కూడా తమకు అనుకూలంగా తీర్పునిచ్చిందని అంటున్నారు.
ఈ స్థలంపై కోర్టు ఉత్తర్వులు ఉన్నందున ఆ స్థలంలో ఎలాంటి గొడవలు సృష్టించవద్దని పోలీసులు ఇరువర్గాలకు సూచించారు. అయితే, మల్లారెడ్డి అనుచరులు తమను భయపెడుతున్నారని 15 మంది సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. భూ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉండగా ఇప్పడు మరో భూవివాదంలో మల్లారెడ్డిపై కేసు నమోదు కావడం చర్చనీయాంశంగా మారింది.












Click it and Unblock the Notifications