తెలంగాణా సర్కార్ మరో కొత్త పథకం... త్వరలో ఆ కార్మికుల కోసం లక్ష బైకులు!!
తెలంగాణా ప్రభుత్వం మరో కొత్త పథకం అందించటానికి రెడీ అవుతుందా? ఈసారి కార్మిక సంక్షేమం కోసం ఈ పథకాన్ని తీసుకు రానుందా? తెలంగాణాలో కర్షక, కార్మిక ఓటు బ్యాంకు కోసం తెలంగాణా సర్కార్ ఇప్పటి నుండే వారిని ప్రసన్నం చేసుకుంటుందా? అంటే అవును అన్న సమాధానమే వస్తుంది.

కార్మికులకు సబ్సిడీపై లక్ష బైకులు
తెలంగాణ ప్రభుత్వం మరో బృహత్తర పథకానికి శ్రీకారం చుట్టనున్నట్లు తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వెల్లడించారు. సిద్దిపేటలో కార్మిక శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పిన ఆయన కార్మిక సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ప్రజల కోసం ఇప్పటికే ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను తీసుకువచ్చి అమలు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టబోతుందని, త్వరలో నిర్మాణ రంగ కార్మికులకు సబ్సిడీ మీద లక్ష బైక్ లు ఇవ్వనున్నామని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.

కార్మికులకు ,మెళకువలు నేర్పేలా శిక్షణా కేంద్రం
తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే రైతుబంధు ద్వారా రైతులకు, దళిత బంధు ద్వారా దళితులకు ఆర్థిక సహాయం చేస్తూ వారి అభ్యున్నతికి కృషి చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఇక తాజాగా మరో కీలక పథకాన్ని అందించటానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు మంత్రి హరీష్ రావు ప్రకటించారు. ఇదే సమయంలో సిద్దిపేటలో ఎల్ అండ్ టి కన్స్ట్రక్షన్ కంపెనీ న్యాక్ సంయుక్త ఆధ్వర్యంలో కార్మికుల కోసం శిక్షణ శిబిరాన్ని మూడునెలల్లో ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. కార్మికులకు పనిలో మెళకువలు, నైపుణ్యత మెరుగుపడేలా శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు.

కార్మిక బంధు అని పేరు పెడతారా? ఆసక్తికర టాక్
దీంతోపాటు కార్మికులకు లబ్ధి చేకూర్చే సరికొత్త పథకాన్ని కూడా అందిస్తామని, అందులో భాగంగా లక్ష బైక్ లు ఇస్తామని వెల్లడించారు హరీష్ రావు. నిర్మాణ రంగ కార్మికులకు సబ్సిడీ మీద లక్ష బైక్ లను పంపిణీ చేయడం కోసం బడ్జెట్ కేటాయింపులు కూడా జరిపినట్టు మంత్రి హరీష్ రావు వెల్లడించారు. అయితే ఈ కొత్త పథకానికి కార్మిక బంధు అని పేరు పెడతారు అన్న టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే పెట్టిన రైతు బంధు, దళిత బంధు తరహాలో దీనికి పేరు పెడతారు అని భావిస్తున్నారు. ఈ కొత్త పథకంలో ఎవరికి ద్విచక్ర వాహనాలు పంపిణీ చేస్తారు అన్నదానిపై ఇంకా పూర్తిగా విధివిధానాలు వెల్లడి కాలేదు.

కార్మికుల కోసం అందించే పథకం పై అనేక ప్రశ్నలు ..
ఇక కార్మికుల కోసం ఇస్తామని చెప్తున్న ఈ పథకాన్ని ఎప్పటినుంచి ప్రారంభిస్తారు అన్నదానిపై కూడా పూర్తి క్లారిటీ లేదు. అర్హులను ఈ పథకంలో ఏ విధంగా నిర్ణయిస్తారు? వారి ఆదాయ పరిమితిని ఎంతవరకూ విధిస్తారు? ఈ పథకం చదువుకోని నిర్మాణ రంగ కార్మికులకు మాత్రమే వర్తిస్తుందా? లేదా చదువుకున్న వారికి కూడా వర్తిస్తుందా? అంతేకాదు ఇప్పటివరకు దళిత బంధు, రైతు బంధు ద్వారా లబ్ది పొందిన వారికి కూడా ఇస్తారా? లేకా వారిని దీని నుండి మినహాయిస్తారా? అన్న అనేక అంశాలు క్లారిటీ రావాల్సి ఉంది.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications