ఎన్నికలే లక్ష్యంగా కేసీఆర్ మరో సర్వే: వణికిపోతున్న 25మంది గులాబీ ఎమ్మెల్యేలు!!

కేసీఆర్ కొత్త సర్వే బలహీనంగా ఉన్న నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు టెన్షన్ పట్టుకుంది. ఎన్నికలే లక్ష్యంగా కేసీఆర్ నిర్వహించనున్న మరో సర్వేతో 25మంది ఎమ్మెల్యేలు వణికిపోతున్నారు.

బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ వచ్చే ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రంలో విజయం సాధించాలని ఇప్పటినుండే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా మరోమారు సర్వే నిర్వహిస్తున్నారు. 21 ప్రశ్నలతో ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తున్నారు. ఒకపక్క ప్రతిపక్ష పార్టీలు గట్టి పోటీ ఇవ్వాలని పాదయాత్ర పేరుతో జోరుగా ప్రజాక్షేత్రంలోకి దూసుకు వెళుతుంటే కెసిఆర్ కూడా తానేమి తక్కువ కాదన్నట్టు ప్రతిపక్ష పార్టీల కంటే నాలుగు అడుగులు ముందే ఉండి క్షేత్రస్థాయిలో పరిస్థితిని ఎప్పటికప్పుడు సర్వేల రూపంలో తెప్పించుకుంటున్నారు.

 అసెంబ్లీ ఎన్నికల లక్ష్యంగా కేసీఆర్ మరో సర్వే ..21 ప్రశ్నలతో ప్రజాభిప్రాయం

అసెంబ్లీ ఎన్నికల లక్ష్యంగా కేసీఆర్ మరో సర్వే ..21 ప్రశ్నలతో ప్రజాభిప్రాయం


తాజాగా మరో మారు త్వరలో కేసీఆర్ కొత్త సర్వేను చేపడుతున్నట్టు పార్టీ వర్గాలలో చర్చ జరుగుతుంది. ఈసారి 21 ప్రశ్నలతో ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే సిట్టింగ్ లందరికీ దాదాపు టికెట్లు ఇస్తానని చెప్పిన కేసీఆర్, సిట్టింగ్ ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి? నియోజకవర్గంలో వారికి ఉన్న ప్రజా మద్దతు ఎంత? వారికి టికెట్ ఇస్తే విజయం సాధించే అవకాశం ఉందా? సొంత పార్టీలో ఆశవహులు ఎవరు? వారిలో ఎవరికి టికెట్ ఇస్తే బెనిఫిట్ ఉంటుంది? లేదా ప్రత్యర్థి పార్టీలో బలమైన నాయకులు ఎవరు? ఒకవేళ వారు ఎవరైనా గెలిచే అవకాశం ఉందా? అటువంటివారిని పార్టీలోకి తీసుకురావడం ఎలా? ఎన్నికల ముందే పార్టీలో చేర్చుకోవాలా? లేదా పరోక్షంగా మద్దతు ఇచ్చే ఎన్నికల తరువాత పార్టీలో చేర్చుకోవాలా? అనేక అంశాల పైన క్షేత్రస్థాయిలో ప్రజల అభిప్రాయాలను తీసుకొని తదనుగుణంగా వ్యవహాలను సిద్ధం చేసే పనిలో ఉన్నారు.

తీవ్ర ఆందోళనలో 25 మంది ఎమ్మెల్యేలు

తీవ్ర ఆందోళనలో 25 మంది ఎమ్మెల్యేలు


ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో 25 మంది ఎమ్మెల్యేలు వచ్చే ఎన్నికల్లో గెలిచే పరిస్థితి లేదని, వారిని మారిస్తే మళ్లీ అధికారం బీఆర్ఎస్ పార్టీ దేనని ఇటీవల ఎర్రబెల్లి దయాకర్ రావు బహిరంగంగానే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక ఈ నేపథ్యంలోనే కెసిఆర్ కూడా విజయానికి అవకాశం లేని ఎమ్మెల్యేల పైన దృష్టి సారించి, వారి విషయంలో నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో నిర్వహించనున్న సర్వే సీఎం కేసీఆర్ వద్ద మంచి మార్కులు లేని ఎమ్మెల్యేలకు వణుకు పుట్టిస్తుంది. దాదాపు 25 మంది ఎమ్మెల్యేలు కెసిఆర్ తాజా సర్వే నేపథ్యంలో తీవ్ర ఆందోళనలో ఉన్నట్టు సమాచారం.

టికెట్ విషయంలో మల్లగుల్లాలు పడుతున్న ఎమ్మెల్యేలు

టికెట్ విషయంలో మల్లగుల్లాలు పడుతున్న ఎమ్మెల్యేలు


కెసిఆర్ అన్న మాట ప్రకారంగా టికెట్ మళ్ళీ తమకు ఇస్తారా? లేక మరేదైనా కారణం చెప్పి తమకు టికెట్ ఇవ్వకుండా ఇబ్బంది పెడతారా? వంటి అనేక ప్రశ్నలు ఆ ఎమ్మెల్యేలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మొత్తానికి సీఎం కేసీఆర్ తీసుకున్న తాజా నిర్ణయం అధికారి ఎమ్మెల్యేల దృష్టిని సర్వే పై మళ్లేలా చేసింది. ఇక బీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేసిన జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలని భావిస్తున్న కేసీఆర్ సొంత రాష్ట్రంలో గెలవడం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు.

సర్వే ఫలితాలను బట్టి ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్యేల భవిష్యత్తు

సర్వే ఫలితాలను బట్టి ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్యేల భవిష్యత్తు

ఒకపక్క తెలంగాణ రాష్ట్రంలో ఈసారి ఎలాగైనా బీఆర్ఎస్ పార్టీని గద్దె దింపాలని బీజేపీ స్ట్రీట్ కార్నర్ మీటింగ్లను నిర్వహిస్తూ ప్రజల్లోకి వెళుతుంది. ఇక మరొక కాంగ్రెస్ పార్టీ నాయకులు పాదయాత్ర పేరుతో ప్రజా మద్దతును కూడగట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉంటే కేసీఆర్ తెలంగాణాలో మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని, జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలని భావిస్తున్న కేసీఆర్ గెలుపు గుర్రాలకు మాత్రమే అవకాశం ఇవ్వడానికి చూస్తున్నారు. ఇందులో భాగంగా నిర్వహిస్తున్న సర్వేల ఫలితాలను బట్టి ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్యేల భవిష్యత్తు ఉండబోతుంది. ఈ క్రమంలోనే కెసిఆర్ తాజాగా నిర్వహించనున్న సర్వే అందరిలో ఉత్కంఠను రేపుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+