బాబుకు దెబ్బపై దెబ్బ, అందర్నీ వణికిస్తున్న కేసీఆర్
హైదరాబాద్: తెలంగాణలో తెలుగుదేశం పార్టీ నుండి పలువురు నేతలు తెరాసలో చేరుతున్న విషయం తెలిసిందే. ఫిరాయింపులకు అడ్డుకట్ట వేసేందుకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు చర్యలు ప్రారంభించారు.
ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలు తెరాసలో చేరడంతో పాటు మరికొంతమంది అదే ఆలోచనలతో ఉండటంతో చంద్రబాబు ఫిరాయింపులకు అడ్డుకట్ట వేసే చర్యలు చేపట్టారు. మరోవైపు, సార్వత్రిక ఎన్నికల అనంతరం తొలిసారిగా చంద్రబాబు మహబూబ్‌నగర్ జిల్లాలో గురువారం పర్యటించనున్నారు.
కాగా, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి 24వ తేదీన తెరాసలో చేరుతున్నారు. మరోవైపు, కాంగ్రెస్ పార్టీ నుండి కరీంనగర్ డీసీసీబీ చైర్మన్, వైస్ చైర్మన్ తదితరులు బుధవారం నాడు కాంగ్రెస్ పార్టీలో చేరారు.

మంచిరెడ్డి
తెలంగాణలో టీడీపీకీ మరో ఎదురుదెబ్బ తగిలింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే, తెదేపా జిల్లా అధ్యక్షుడు అయిన మంచిరెడ్డి కిషన్ రెడ్డి తెరాసలో చేరనున్నట్టు ప్రకటించారు.

మంచిరెడ్డి
ముఖ్యమంత్రి కేసీఆర్‌తో బుధవారం ఉదయం క్యాంపు కార్యాలయంలో కిషన్ రెడ్డి భేటీ ముగిసిన అనంతరం ఆయనే స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించారు.

మంచిరెడ్డి
తన నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయనున్నట్టు సీఎం హామీ ఇవ్వడంతో తెరాసలో చేరాలని నిర్ణయించుకున్నట్టు ప్రకటించారు. తెరాస ప్లీనరీ జరిగే ఈనెల 24న అధికారికంగా తెరాసలో చేరుతానని వెల్లడించారు.

కాంగ్రెస్
కాంగ్రెస్‌కు చెందిన డీసీసీబీ చైర్మన్ రవీందర్ రావు, వైస్ చైర్మన్ మోహన్ రెడ్డి బుధవారం సాయంత్రం క్యాంపు కార్యాలయంలో తెరాసలో చేరారు.

కాంగ్రెస్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సమక్షంలో వారు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరారు.

కాంగ్రెస్
ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో డీసీసీబీ చైర్మన్ రవీందర రావు, వైస్ చైర్మన్ మోహన్ రెడ్డిలతో పాటు పలువురు కాంగ్రెస్, వైసీపీ నాయకులు తెరాసలో చేరారు.

కాంగ్రెస్
కాంగ్రెస్‌కు చెందిన డీసీసీబీ చైర్మన్ రవీందర్ రావు, వైస్ చైర్మన్ మోహన్ రెడ్డి బుధవారం సాయంత్రం క్యాంపు కార్యాలయంలో తెరాసలో చేరారు.












Click it and Unblock the Notifications