అప్పుల బాధ: హైదరాబాద్‌లో మరో రైతు ఆత్మహత్య

హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులో మరో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. మెదక్ జిల్లాకు చెందిన మల్లేష్ అనే రైతు బేగంపేట పంప్ హౌస్ వద్ద చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

అతను అప్పుల బాధతో కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ వచ్చాడు. సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. అయితే, దీంతో వచ్చే జీతంతో అప్పులు తీర్చలేక, బతుకు వెళ్లదీయలేక అతను ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది.

అండగా ఉంటాం: కవిత

ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకునే బాధ్యత మనందరిదని ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఇవాళ ఆమె తెలంగాణ భవన్‌లో తెలంగాణ జాగృతి తరపున ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు.

Another Telangana farmer commits suicide in Hyderabad

ఈ కార్యక్రమంలో క్రీడాకారులు గుత్తా జ్వాల, ప్రజ్ఞాన్ ఓజా పాల్గొన్నారు. సానియా మీర్జా చైనా పర్యటనలో ఉండటంతో ఆమె తల్లి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే కుటుంబ పెద్ద లేనట్టేనని తెలిపారు.

దీంతో రైతు కుటుంబ భారం రైతు భార్యపై పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను ఆదుకునేందుకు అందరూ వచ్చి తెలంగాణ జాగృతిని కలవాలన్నారు.

పెద్దల సలహాలు తీసుకుని రైతులు, వారి కుటుంబాల బాగు కోసం ముందుకు సాగుతామని వెల్లడించారు. నవంబర్ 1 నుంచి తెలంగాణ జాగృతి చేసే సహాయం రైతుల కుటుంబాలకు అందుతుందని వెల్లడించారు. ఆ రోజు నుంచి రైతు కుటుంబాలకు డబ్బు అందేలా ఏర్పాట్లు చేస్తామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+